Viral Video: కూతురిని కొట్టడానికి వచ్చిన తల్లి.. అడ్డుపడిన పెంపుడు కుక్క.. చివరికి ఏం చేసిందంటే… వీడియో వైరల్..
సాధారణంగా..కుక్కలు విశ్వాసం కలవి అంటారు. నిజమే మరి వీటికి మిగతా జంతువులతో పోలీస్తే విశ్వాసం ఎక్కువే ఉంటుంది.
సాధారణంగా..కుక్కలు విశ్వాసం కలవి అంటారు. నిజమే మరి వీటికి మిగతా జంతువులతో పోలీస్తే విశ్వాసం ఎక్కువే ఉంటుంది. మానవులతో కలసిమెలసి ఉంటూ ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతాయి. ఇక తమను ప్రేమగా చూసుకునే యాజమానుల పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తాయి. కాసింత ప్రేమ కురిపిస్తే.. యాజమాని కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడవు. అయితే కొన్ని సందర్భాల్లో కుక్కలు చేసే పనులు అందరినీ ఆశ్చరపరుస్తుంటాయి. ఇప్పటికీ తమ యాజమానుల కోసం పెంపుడు కుక్కలు ఎంత విశ్వాసం, ప్రేమ చూపించడం.. వారితో కలిసి చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అందులో ఒక యువతికి ఆమె తల్లి కర్రతో కొట్టడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే అక్కడే ఉన్న కుక్క ఆమెను కొట్టవద్దని.. అడ్డు పడుతుంది. దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఆ యువతికి గట్టిగా పట్టుకోని పడుకుంది. ఆ పెంపుడు కుక్క చూపించే ప్రేమకు అక్కడున్న వారంత చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుక్క ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ట్వీట్..
View this post on Instagram
Sapota Benefits: సపోటాలో ఎన్నో పోషకాలు.. ఈ పండుతో అలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?