పెళ్లిలో నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు… పెళ్లికొడుకుకు రీడింగ్ టెస్ట్.. చివ‌రికి ఇలాంటివాడు వ‌ద్ద‌న్న‌ వ‌ధువు!

పెళ్లికి భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లిలో అబ్బాయి.. అమ్మాయి తరుపువారు చేసే సందడి మాములుగా ఉండదు.

పెళ్లిలో నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు... పెళ్లికొడుకుకు రీడింగ్ టెస్ట్.. చివ‌రికి ఇలాంటివాడు వ‌ద్ద‌న్న‌ వ‌ధువు!
Viral News
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 23, 2021 | 8:29 AM

పెళ్లికి భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లిలో అబ్బాయి.. అమ్మాయి తరుపువారు చేసే సందడి మాములుగా ఉండదు. పెళ్లితో రెండు కుటుంబాల కలయిక ముడిపడుతుంది. ఆటలు… డ్యాన్సులు, గిల్లికజ్జాలు ఒక్కటేమిటి ఎన్నో సరదాలు పెళ్లిలో ఉంటాయి. అయితే అదే పెళ్లిలో అమ్మాయి.. పెళ్లి కొడుకుకు రీడింగ్ టెస్ట్ పెడితే ఎలా ఉంటుంది ? నిజాంగానే ఓ పెళ్లి కూతురు.. మండపంలో ఉన్న అబ్బాయి చేతికి దిన పత్రిక ఇచ్చి చదవమని కోరింది. దీంతో ఆ పెళ్లికొడుకు బిక్కమొఖం వేశాడు. ఇంకేముంది.. వరుడితో తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి.. అక్కడున్న వారందరికి షాకిచ్చింది.

ఈ ఘటన యూపీలోని ఔరయ పరిధిలో జరిగింది. అచల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమార్ తో తన కుమార్తే వివాహం చేయాలని నిశ్చయించారు. పెళ్లిరోజున… వేదికగా అబ్బాయి నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడంతో అతనిపై అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వారు వరుని తరుపువారిని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో… నేరుగా వరుని చేతికి ఓ వార్త పత్రిక ఇచ్చి దానిని చదవమన్నారు. అతను చదవలేకపోయాడు. దీంతో వారంతా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై ఇరువర్గాల మధ్య పంచాయితీ జరిగింది. దీంతో వధువు తనకు ఈ పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది. అంతేకాకుండా.. వరుడి కుటుంబ సభ్యులపై… వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Viral Video: ఆ మత్స్యకారుడి అదృష్టం పండింది.. వలకు చిక్కిన చేపను కోసి సంబరపడిపోయాడు.. ఇంతకీ ఏం దొరకిందంటే!

Groom Beaten: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.. విషయం తెలిసి అబ్బాయిని చితకబాదిన అమ్మాయి కుటుంబసభ్యులు

గతేడాది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ఈ ఏడాది అమలవుతోందా..! విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు..?

Shahid Kapoor: రాజ్, డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్ వెబ్ సిరీస్.. డిజిటల్ ఎంట్రీపై భయపడుతున్న బాలీవుడ్ హీరో..