AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid Kapoor: రాజ్, డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్ వెబ్ సిరీస్.. డిజిటల్ ఎంట్రీపై భయపడుతున్న బాలీవుడ్ హీరో..

ప్రస్తుతం ఓటీటీలకు ప్రేక్షకాధరణ ఎక్కువైంది. థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అందుకుంటున్నాయి.

Shahid Kapoor: రాజ్, డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్ వెబ్ సిరీస్.. డిజిటల్ ఎంట్రీపై భయపడుతున్న బాలీవుడ్ హీరో..
Shahid Kapoor
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2021 | 7:06 AM

Share

ప్రస్తుతం ఓటీటీలకు ప్రేక్షకాధరణ ఎక్కువైంది. థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అందుకుంటున్నాయి. అలాగే ప్రముఖ నటీనటులు డిజిటల్ ఎంట్రీ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సమంత, ప్రియమణి.. హాన్సిక, నయనతార, తమన్నా ఇలా చాలా మంది సెలబ్రెటీలు డిజిటల్ ఫ్లాట్ ఫాంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా డిజిటల్ ఎంట్రీకి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సిద్ధమవుతున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్స్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా.. సోమవారం షాహిద్ కబీర్ సింగ్ మూవీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన డిజిటల్ ఎంట్రీ పై స్పందించాడు. ఓ అభిమాని తన ఓటీటీ ఎంట్రీపై ప్రశ్నించగా.. రాజ్, డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయడం సంతోషంగా ఉన్నా అదే సమయంలో చాలా భయంగా కూడా ఉందంటూ సమాధానమిచ్చాడు షాహిద్ కపూర్.

డిజిటల్ ఎంట్రీపై భయపడుతున్న.. ఎందుకంటే.. బిగ్ స్క్రీన్ ప్రేక్షకుల ప్రేమ అందుకున్న ప్రతి నటీనటులంతా ఓటీటీలో వారి ప్రశంసలు అందుకోవచ్చు లేదా అందుకోకపోవచ్చు. సినిమాల్లో వచ్చిన సక్సెస్ ఓటీటీలో రాకపోవచ్చు. సినిమాలకు అక్కడ ఆదరణ ఉంటుందన్న గ్యారంటీ లేదు అంటూ వివరణ ఇచ్చాడు షాహిద్ కపూర్. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసిన డైరెక్టర్స్ తో నా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారు నాకు కథ వివరించగానే నచ్చి ఒకే చెప్పాను. ఆ కథతో త్వరలోనే ముందుకు వస్తాను. కానీ అప్పటివరకు వెయిట్ చేయలేకపోతున్న అంటూ రాజ్, డీకేలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు షాహిద్ కపూర్.

Also Read: Maestro Movie: ఓటీటీలోకి నితిన్ ‘మాస్ట్రో’ మూవీ.. చర్చల్లో చిత్ర యూనిట్ ?

Anirudh Ravichander: తెలుగులో విజయాలు లేవు.. అయినా 3 బడా చిత్రాల్లో అవకాశాలు !