Karthika Deepam: మోనిత మీద అనుమానంతో దీప .. తన పెళ్లి తేదీ చెప్పి.. సౌందర్య ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన మోనిత

Karthika Deepam: మురళీ కృష్ణ భాగ్యం కోసం ఎదురుచూస్తుంటారు.. ఇంతలో భాగ్యం వచ్చి... దీపకి అన్యాయం చేయొద్దని చెప్పనని .. సౌందర్యను చూస్తుంటే..

Karthika Deepam: మోనిత మీద అనుమానంతో దీప .. తన పెళ్లి తేదీ చెప్పి.. సౌందర్య ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన మోనిత
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Jun 23, 2021 | 11:19 AM

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1073 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ లోని హైలెట్స్ ను ఈరోజు చూద్దాం.. మురళీ కృష్ణ భాగ్యం కోసం ఎదురుచూస్తుంటారు.. ఇంతలో భాగ్యం వచ్చి… దీపకి అన్యాయం చేయొద్దని చెప్పనని .. సౌందర్యను చూస్తుంటే జాలి వేస్తుందని అంటుంది. దీప పిల్లలు నిద్ర పోతుంటే.. తన జీవితం తలుచుకుంటుంది. నా దురదృష్టం మీకు వచ్చింది.. మీ ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంటె..

కార్తీక్ .. మాత్రం మోనిత చేసిన పనికి తన మాటలను తల్చుకుని బాధపడుతుంటాడు.. దీప గుమ్మం దగ్గరకు వచ్చి కార్తీక్ ని చూస్తుంది..గోడమీద గీతల్ని చూస్తూ.. కార్తీక్ ఏడుస్తూ.. ఏడుస్తూ.. ‘దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ మోనితా.. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్.అంటూ బాధపడుతుంటారు.. ఇదంతా చూసిన దీప మనసులో డాక్టర్ బాబు ఎందుకు ఇంత మదనపడుతున్నారు..  తాను నమ్మిన దానిని తప్పు అయినా ఒప్పు అంటారు.. నా గురించి ఎంతమంది చెప్పినా నమ్మలేదు. తాను నమ్మిందే ఒప్పు అంటారు.. మోనిత విషయంలో పోనీ ఇది జరగక ముందు భార్యతో సవ్యంగా కాపురం చేస్తున్నచేసిన వాడు ఐతే.. భార్యకు అన్యాయం చేసానని బాధపడవచ్చు. నన్ను దూరం పెట్టి పదేళ్లు అయ్యింది. మోనిత అంటే ఇష్టం.. పెళ్లి చేసుకుంటానని చాలా సార్లు చెప్పారు కూడా మరి ఇంకెందుకు అంత బాధ.. నాకు మోనిత అంటే ఇష్టం.. అందుకే మేము కలిసాం అని చెప్పొచ్చు.. అయినా ఆలా చెప్పడం లేదు.. పైగా కుమిలి పోతున్నారు.. ఎం జరిగింది అంటూ ఆలోచిస్తూ. కార్తీక్ దగ్గరకు దీప మంచి నీరు తీసుకుని వచ్చి ఇస్తుంది.

భగవంతుడు మరో రూపంలోనైనా నాకు తెలియజేసి ఉండొచ్చు కదా.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిన వ్యక్తికే.. నా వల్ల అలా జరగడం.. నాకు తండ్రి అయ్యే అవకాశం ఉందని నా క్లోజ్ ఫ్రెండ్ వల్లే నిరూపించబడటం నేను తట్టుకోలేకపోతున్నాను’ అని కార్తీక్ కుమిలిపోతుంటే.. దీప మాత్రం అదిరిపోయే నిజాన్ని విన్నట్లుగా.. షాక్ అవుతూ.. ‘మీకు పిల్లలు పుట్టరు అని.. ఆ అవకాశమే లేదు అని.. చెప్పింది మోనితా? డాక్టర్లు కాదా?’ అంటుంది అనుమానంగా చూస్తూ.

‘అదేం శుభవార్త కాదు కదా.. అందరూ చెప్పడానికి.. డాక్టర్లు చెప్పిందే మోనిత చెప్పింది.. నేను బాధపడతానని డాక్టర్లే మోనితతో చెప్పించారు.. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్‌కే..’ అని కార్తీక్ కుమిలిపోతూ చెప్పడంతో దీపకు విషయం అర్థమైన దానిలా చూస్తుంది. అయితే వెంటనే కార్తీక్ దీపతో.. ‘నీకో విషయం తెలుసా? నేను ఎప్పుడూ మందు కొట్టడానికి ప్రిఫర్ చెయ్యను. బయట పార్టీలు కూడా అవైడ్ చేస్తాను.. ఆ రోజు నా టైమ్ బ్యాడ్.. మోనిత ఇంట్లోనే పీకలు దాకా తాగాను.. మన మధ్య తప్పు జరిగిపోయిందని మోనిత చెప్పేంత వరకూ నాకు తెలియదు.. అంత మత్తులో ఉన్నాను..

మంచినీరు తగిన తర్వాత అక్కడ నుంచి గ్లాస్ ను తీసుకుని వెళ్లబోతుంటే.. కార్తీక్ దీప చేయి పట్టుకుని ఆపి.. నాతో మాట్లాడు దీప.. చేయని తప్పుకి పదేళ్లు శిక్ష అనుభవించా.. నీకు తెలిసిరావాలి అంటూ.. ఇలా మౌనంగా ఉంటున్నావా.. నన్ను తిట్టు.. లేదంటే చెంపమీద కొట్టు దీప ఇదంతా నా కర్మ దీపా అంటూ దీపతో కన్నీటి మధ్య తన బాధను చెప్పే ప్రయత్నం చేస్తాడు.. దీప అంటూ.. భగవంతుడు మరో రూపంలోనైనా నాకు తెలియజేసి ఉండొచ్చు కదా.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిన వ్యక్తికే.. నా వల్ల అలా జరగడం.. అంటూ కార్తీక్ చెబుతుంటే… దీప షాక్ తో మీకు పిల్లలు పుట్టరని విషయం డాక్టర్లు చెప్పలేదా మోనిత సి చెప్పిందా అని అడుగుతుంది. డాక్టర్లు చెప్పిందే మోనిత నాకు చెప్పింది అంటాడు.. అంతేకాదు.. నీకో విషయం తెలుసా.. మోనిత ఇంట్లో ఫుల్ గా తాగాను.. మోనిత మన మధ్య తప్పు జరిగింది అని చెప్పేవరకూ నాకు ఏమి తెలియదు.. అంతగా తాగానా.. అంత మత్తులో ఉన్నానా అని ఆలోచిస్తుంటే.. నామీద నాకే అసహ్యం వేస్తుంది దీప.. నేను బయట తాగడానికి ఇష్టపడను.. పార్టీలకు కూడా వెళ్ళను. అని కార్తీక్ దీపకు చెప్పి.. ఏడుస్తూనే..అంత తాగి సంస్కారం లేకుండా అంత లేకి పని చేసినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను..నన్ను నమ్ము దీపా.. నేను ఏ అమ్మాయిని ఆ ఆలోచనతో చూడలేదు.. ఎవరినైనా అడుగు అంటూ కన్నీరు పెట్టుకుంటారు.. ఇదంతా విన్న దీప షాక్ లో ఉంటుంది.. నిద్రపోండి.. అంటూ కార్తీక్ కి చెప్పి.. కార్తీక్ చెప్పిన మాటలను దీప ఆలోచిస్తూ ఉంటుంది.

ఆదిత్య ఇంట్లో నుంచి బయలుదేరుతుంటే… సౌందర్య ఎక్కడికి అని అడుగుతుంది.. వదిన దగ్గరకి.. పిల్లల్ని చూసి వస్తా అంటాడు.. వద్దు.. కార్తీక్ అక్కడ ఉన్నాడు.. నువ్వు ఏదొక మాట అంటావు.. అసలే బాధలో ఉన్న మీ అన్నయ్య ఇంకా బాధపడతాడు అంటుంది. చేసుకున్నవారికి చేసుకున్నంత.. అని అంటాడు ఆదిత్య.. అలా నాకు నాకు కార్తీక్ ను చూస్తుంటే బాధవేస్తుంది అంటుంది సౌందర్య..

మర్నాడు.. దీప అరుబాట నిల్చుని.. మోనిత గురించి ఆలోచిస్తుంది.. మోనిత ప్రవర్తన.. ఇంజెక్షన్ ఇచ్చినప్పటి సన్నివేశం.. తనని అంజిని బెదిరించిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. మోనిత మామూలు ఆడది కాదు.. ఒక సైకో.. సంసారపక్షమైన ఆడది.. ఒక సాధారణ స్త్రీ ఆలోచించే పద్దతిలో మోనిత ఉండదు..దాని మెదడు నిండా కుట్రలు కుతంత్రాలే. అన్నీ పథకాలే..

ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అలాంటి కుట్రలో భాగమేనా అని ఆలోచిస్తూనే.. అలాగ అయ్యి ఉండదు.. ఎందుకంటే ఏ విషాయంలోనైనా ఆలా చేయవచ్చు ఈ విషయంలో కాదు.. ఆయన కూడా డాక్టర్ డీఎన్ఏ టెస్ట్ చేయిస్తారని తెలుసు.. మరి ఎం అయ్యింది ఉంటుంది.. ఏమి జరిగి ఉంటుంది. ఆయన మోనిత ను అనుమానంగా చూస్తున్నారు.. ఎందుకు అంత బాధపడుతున్నారు.. మోనిత మీద ఆయన కళ్ళల్లో అభిమానం లేదు.. ఎదో అనుమానం అసలు మోనిత చెప్పేవరకూ తమ మధ్య ఏమి జరిగిందనేది తెలియదు అంటున్నారు.. అసలు ఈ విషయంలో ఎం జరిగింది. అన్నిట్లోనూ అబద్దాలు చెప్పినట్లు ఈ విషయంలో చెప్పడానికి లేదు.. మరి ఎం జరిగి ఉంటుంది ఏమో మోనిత మాములు ఆడది కాదు.. అసలు ఆడదే కాదు.. ఎంతకైనా తెగిస్తుంది. దానిది క్రిమినల్ బ్రెయిన్.. ఆడో సైకో.. ఎదో జరిగింది.. దేని వెనుక కారణం ఏమిటి అని ఆలోచిస్తుంది.. దీప..

రేపటి ఎపిసోడ్ లో సౌందర్య దగ్గరకు వెళ్లి.. తనకు కార్తీక్ కు పెళ్లి అని ఆశీర్వదించమని కోరుతుంటే.. అదే సమయంలో హిమ శౌర్యలు అడుగు పెడతారు.. మరి కార్తీక్ మోనిత కండిషన్ ప్రకారం తాళి కడతాడా.. లేక దీప మోనిత గుట్టు రట్టు చేస్తుందా వేచి చూడాల్సిందే..

Also Read:  నీళ్లే నిప్పయి మండుతున్నాయి. ప్రాంతాల మధ్య అగ్గిపుట్టిస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ షురూ!

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?