AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maestro Movie: ఓటీటీలోకి నితిన్ ‘మాస్ట్రో’ మూవీ.. చర్చల్లో చిత్ర యూనిట్ ?

నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మాస్ట్రో. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తుండగా.. ఇస్మార్ట్ బ్యాటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Maestro Movie: ఓటీటీలోకి నితిన్ 'మాస్ట్రో' మూవీ.. చర్చల్లో చిత్ర యూనిట్ ?
Maestro
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2021 | 7:06 AM

Share

నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మాస్ట్రో. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తుండగా.. ఇస్మార్ట్ బ్యాటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల సమర్పణలో ఎన్. సుదాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన అంధాదూన్ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నితిన్ అంధుడైన పియానో ప్లేయర్ గా కనిపించనున్నారు.

ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో హీరో నితిన్.. తమన్నా లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించి షూటింగ్ ముగించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక లాక్ డౌన్ ఎత్తివేయడంతో త్వరలోనే థియేటర్లు కూడా ఓపెన్ కాబోతుండడంతో.. సినిమా విడుదల తేదీపై ఫోకస్ పెట్టింది చిత్రయూనిట్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ థియేట్రికల్ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్రయూనిట్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. అన్ని హక్కుల కోసం.. భారీ మొత్తం ఇచ్చేందుకు కూడా సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై చిత్రయూనిట్.. సదరు ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతోంది. ఆగస్ట్ నాటికి థియేటర్లు ఓపెన్ అయితే సినిమా విడుదల చేయాలని.. లేదంటే.. ఓటీటీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక వచ్చే నెల జూలైలో పరిస్థితుల్ని బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Karanama Malleswari: ఆప్ సర్కార్ కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా.. కరణం మల్లీశ్వరి నియామకం..

DR. Mukherjee Death Anniversary: ‘ఒక దేశంలో ఒకే రాజ్యాంగం’.. డా. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు

Gold Price Today: పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర తగ్గాయంటే..?