Surya-Jyothika : వ్యాక్సిన్ తీసుకున్న హీరో సూర్య దంపతులు… సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
Surya-Jyothika : ప్రస్తుతం కరోనాను జయించడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క అస్త్రం వ్యాక్సిన్.. టీకాతో పూర్తిగా కరోనాను నియంత్రించలేం.. కానీ ఐసీయూ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Surya-Jyothika : ప్రస్తుతం కరోనాను జయించడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క అస్త్రం వ్యాక్సిన్.. టీకాతో పూర్తిగా కరోనాను నియంత్రించలేం.. కానీ ఐసీయూ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కరోనా రెండో దశ విలయతాండవం సృష్టించడంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. దీంతోపాటు.. టీకా పై అపోహలు ఉన్నవారిలో భయాన్ని తొలగించేందుకు కూడా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు భయాన్ని వీడి టీకా వేసుకోవాలని.. ప్రభుత్వాలతోపాటు.. సెలబ్రెటీలు కూడా ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా తాము వ్యాక్సిన్ వేసుకున్నామంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. Covid Vaccine
తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య దంపతులు వ్యాక్సిన్ వేసుకున్నారు. మంగళవారం (జూన్ 22) సూర్య, జ్యోతిక టీకా తీసుకున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వ్యాక్సినేటెడ్ అంటూ భార్య జ్యోతిక, సూర్య వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోలను ట్వి్ట్టర్ ఖాతాలో షేర్ చేశాడు సూర్య. ఇక సినిమాల విషయానికి వస్తే.. సూర్య ఇటీవల నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లుగా సమాచారం.
ట్వీట్..
#Vaccinated pic.twitter.com/3SJG9wYPFD
— Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2021