గతేడాది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ఈ ఏడాది అమలవుతోందా..! విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు..?

Telangana Schools: కరోనా కష్టకాలంలో గతేడాది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 అమలవుతోందా..! ఇప్పటికే ఎన్నోసార్లు ఈ జీవోపై విచారించిన తెలంగాణ హై కోర్టు ఏం స్పష్టత..

గతేడాది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ఈ ఏడాది అమలవుతోందా..! విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Jun 23, 2021 | 7:09 AM

Telangana Schools: కరోనా కష్టకాలంలో గతేడాది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 అమలవుతోందా..! ఇప్పటికే ఎన్నోసార్లు ఈ జీవోపై విచారించిన తెలంగాణ హై కోర్టు ఏం స్పష్టత ఇచ్చింది..?. గతేడాది విడుదలైన ఈ జీవో పేరెంట్స్ కు ఎంత ఉపయోగపడింది..? ఈ ఏడాది కూడా జీవో 46 కొనసాగింపు పై పేరెంట్స్ పేరెంట్స్ ఏమంటున్నారు.? ఇంకా పాఠశాలల నిర్వహణపై ఎలాంటి స్పష్టత రాక ముందే అటు పేరెంట్స్ ఇటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మళ్లీ సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. జూలై 1 నుండి పాఠశాలలు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో జీవో 46పై మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కరోనా కష్టకాలంలో అనేక రంగాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఇల్లు గడవడమే కష్టంగా మారిన స్థితిలో లో పిల్లల ఫీజులు చెల్లించే పరిస్థితులు తల్లిదండ్రులకు లేవు. ఈ విపరీత పరిస్థితిని గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ విపత్తుల నిర్వహణ చట్టాన్ని (2005) దృష్టిలో పెట్టుకొని జీవో నెంబర్ 46 ని విడుదల చేశారు.

జీఓ 46 లో స్పష్టంగా పేర్కొన్న అంశాలు..

1) 2020-21 విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీ మాత్రమే వసూల్ చేయాలి. 2) గత సంవత్సరం ఎంత ట్యూషన్ ఫీ ఉందో అదే వసూలు చేయాలి. ఎలాంటి రుసుములను పెంచకూడదు 3) అది కూడా నెల వారిగా మాత్రమే తీసుకోవాలి. 4. పై సూచనలను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు అవుతుంది, నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణపై తగిన చర్యలను ప్రారంభిస్తుంది. 5. పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ, ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది

ఇంత స్పష్టంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ అనేక పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘించి తమదైన విధానంలో ఫీజులను వసూలు చేశాయి. ఆన్‌లైన్‌ తరగతులకు కూడా గతేడాది లాగే అన్ని ఫీజులు కలుపుకొని వసూలు చేయడంపై పేరెంట్స్ అసోసియేషన్స్ భగ్గుమన్నాయి. ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఎంతో నష్టపోయిన తమకు తరగతులు నడవకుండా ఫీజులు కట్టడం ఏంటని విద్యా శాఖ కూడా ఎన్నో ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ కార్పొరేట్ కళాశాలలు ఏ మాత్రం ఊరుకోవడం లేదు. సకాలంలో ఫీజులు చెల్లించని పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు నిలిపివేసి అటు పేరెంట్స్ ఇటు విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో ఎన్నో పాఠశాలల ముందు పేరెంట్స్ ధర్నాలకు సైతం దిగారు. ప్రైవేటు పాఠశాలల తీరుపట్ల మానసిక వేదనకు గురైన ఎంతో మంది పేరెంట్స్ విధిలేని పరిస్థితుల్లో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎన్నో ఫిర్యాదులు అందుకున్న విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఆయా పాఠశాలలపై చర్యలకు ఉపక్రమించింది. గతేడాది జీవో నెంబర్ 46 ఉల్లంఘనలకు పాల్పడిన ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలపై కొరఢా ఝుళిపించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 8వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 11 కార్పొరేట్ పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. ఈ పాఠశాలల పై విచారణ చేపట్టిన నలుగురు జాయింట్ డైరెక్టర్ల బృందం విచారణ అనంతరం 11 పాఠశాలల సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి కి సమర్పించింది. ఈ నివేదికలో 11స్కూళ్శు నిబంధనలు ఉల్లంఘించారని ఆధారాలతో నివేదిక సమర్పించింది. నిబంధనల ఉల్లంఘనల నివేదికను ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది.

ఇప్పటికే పలుసార్లు జీవో నెంబర్ 46, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై నిన్న హైకోర్టు లో జరిగిన విచారణలో అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ కోర్టుకు తెలిపింది. జీవో 46ను ఉల్లంఘించిన పాఠశాలలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నామని తెలిపిన విద్యాశాఖ.. 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కొర్చుకు తెలిపింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు తమ పరిధిలోకి రావని.. సంబంధిత బోర్డుల దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేసినందున ఆన్ లైన్ పాఠాలపై విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే జీవో నెంబర్ 46 ను ప్రభుత్వం జారీ చేసినప్పటికీ .. ప్రైవేటు పాఠశాలలు మాత్రం యథావిధిగానే వ్యవహరించాయి. తరగతులు రెగ్యూలర్‌గా జరుకుండా ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ? నష్టపోయిన పేరెంట్స్ కి ఎలాంటి న్యాయం చేశారు అని ప్రశ్నిస్తున్నారు నేషనల్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివి శర్మ.

ఇవీ కూడా చదవండి:

FIR: సీఎం కేసీఆర్, హోంమంత్రిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు..

Telangana Ed-CET: ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు మ‌రోసారి పెంపు.. ఎప్ప‌టివ‌ర‌కు అవ‌కాశ‌ముందంటే..