Telangana Ed-CET: ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు మరోసారి పెంపు.. ఎప్పటివరకు అవకాశముందంటే..
Telangana Ed-CET: కరోనా కారణంగా విద్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేశాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే...
Telangana Ed-CET: కరోనా కారణంగా విద్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేశాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పలు పోటీలను వాయిదా వేస్తూ వచ్చింది. ఈ జాబితాలోకి వస్తుంది తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్ష. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడగిస్తూ వస్తోన్న ప్రభుత్వం తాజాగా మరోసారి గడువును పెంచింది. ఎడ్‌సెట్ దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనున్న నేపథ్యంలో మరోసారి పొడగించారు. ఈ క్రమంలోనే ఈ నెల 22 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లాభం చేకూరుతుందని రామకృష్ణ తెలిపారు. ఇక తెలంగాణలో ఎడ్ పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలను బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు.