NFL Recruitment: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
NFL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు...
NFL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 23 ఖాళీలకు గాను.. సీనియర్ మేనేజర్ (02), అకౌంట్స్ ఆఫీసర్ (07), అసిస్టెంట్ మేనేజర్(మెటీరియల్స్)– (04), మెటీరియల్స్ ఆఫీసర్– (10) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సీఏ/సీఎంఏ/ఫైనాన్స్/ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్‌లో ఫుల్ టైం ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
* అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సీఏ/సీఎంఏ/ఫైనాన్స్/ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైం ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
* అసిస్టెంట్ మేనేజర్(మెటీరియల్స్) పోస్టులకు అప్లై చేసుకునే వారు.. ఏదైనా స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ డిగ్రీ/మెటీరియల్స్ మేనేజ్‌మెంట్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైం రెగ్యులర్ ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* మెటీరియల్స్ ఆఫీసర్ పోస్టులకుగా గాను.. ఏదైనా స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ డిగ్రీ /మెటీరియల్స్ మేనేజ్‌మెంట్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైం రెగ్యులర్ ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ముఖ్యమై విషయాలు..
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తును నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఏ–11, సెక్టార్–24, నోయిడా, డిస్టిట్ గౌతమ్ బుద్ధ నగర్, యూపీ–201301 చిరునామాకు పంపించాలి. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 02.07.2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం www.nationalfertilizers.com వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా1,175 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..