తొమ్మిది దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్.. ఇండియాలో 22 కేసులు: కేంద్రం

డెల్టా ప్లస్ మ్యుటేషన్ ఇండియా సహా తొమ్మిది దేశాల్లో ఉందని....వీటిలో 22 కేసులు మన దేశంలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా...

తొమ్మిది దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్.. ఇండియాలో 22 కేసులు: కేంద్రం
Covid Variant
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 22, 2021 | 9:16 PM

డెల్టా ప్లస్ మ్యుటేషన్ ఇండియా సహా తొమ్మిది దేశాల్లో ఉందని….వీటిలో 22 కేసులు మన దేశంలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా…జలగావ్…కేరళలోని కొన్ని ప్రాంతాల్లోనూ, మధ్యప్రదేశ్ లోను ఈ కేసులు ఉన్నట్టు వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ పై గల జాతీయ నిపుణుల బృందం హెడ్ వి.కె. పాల్ తెలిపారు. డెల్టా ప్లస్ ఆరిజిన్ అయిన డెల్టా వేరియంట్ 80 దేశాల్లో కొనసాగుతోందనాన్రు. కాగా అమెరికా, యూకే, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, రష్యా, చైనా దేశాల్లో ప్లస్ స్ట్రెయిన్ ఉందని అయితే దీనిపై ఇండియాలోని రెండు రకాల వ్యాక్సిన్ల తయారీ సంస్థలు త్వరలో తమ డేటాను సమర్పిస్తాయని ఆయన చెప్పారు. అయితే దేశంలోని ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ షాహిద్ జమీల్ మాత్రం ఈ డెల్టా ప్లస్ ప్రమాదకరమైనదని అంటున్నారు. ఇది కోవిద్ వ్యాక్సిన్ శక్తిని, యాంటీ బాడీలను హరించవచ్చునని, వ్యాధి నిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపవచ్చునని ఆయన పేర్కొన్నారు. దీనినే ఏవై 417 ఎన్ అని కూడా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు.

సౌతాఫ్రికాలో కనుగొన్న డెల్టా ప్లస్ లో ఇలాంటి కొత్త వేరియంట్ ఉండడం నిపుణులను సైతం ఆశ్చర్య పరిచిందన్నారు. మరోవైపు ఇండియాలో డెల్టా ప్లస్ వేగంగా సంక్రమిస్తుందా అని చెప్పడానికి ప్రస్తుతానికి ఆధారాలు లేవని ప్రొఫెసర్ షాహిద్ జమీల్ చెప్పారు. 25 వేల సీక్వెన్స్ లో 22 కేసులు చాలా స్వల్పమని కానీ దీనిపట్ల అప్రమత్తంగా ఉండడం అవసరమని అయన అన్నారు. ఇప్పుడిప్పుడే కోవిద్ కేసుల నుంచి తెప్పరిల్లుతున్న దేశానికి ఈ డెల్టా ప్లస్ ‘ఉనికి’ ఆందోళనకరమే అని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Savitri Real Life: గుమ్మడి జ్ఞాపకాల్లో సావిత్రి దానగుణం.. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ పాఠం అని చెప్పిన వైనం

EPF Money Withdrawn : పీఎఫ్ మనీ విత్ డ్రా చేస్తే ఎన్ని రోజులకు అకౌంట్లో జమ అవుతాయి..! వడ్డీని ఏ విధంగా లెక్కిస్తారు..?