China Vaccination: ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో డ్రాగన్ కంట్రీ.. ప్రజలకు 100కోట్ల పైగా డోసులు… ( వీడియో )

చైనాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వెల్లువెత్తింది. తమ దేశ ప్రజలకు 100కోట్ల డోసులకు పైగా టీకామందులు ఇచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన దేశంగా పాపులర్ అయింది.

|

Updated on: Jun 22, 2021 | 7:01 PM

చైనాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వెల్లువెత్తింది. తమ దేశ ప్రజలకు 100కోట్ల డోసులకు పైగా టీకామందులు ఇచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన దేశంగా పాపులర్ అయింది. ఈ నెల 19 నాటికి చైనా.. వందకోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్టు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ఆరు రోజుల వ్యవధిలోనే 10 కోట్ల డోసుల పైగా వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఈ సంస్థ పేర్కొంది. జూన్ నెలాఖరుకు దేశ జనాభాలో 40 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని చైనా ఆరోగ్య నిపుణుడు జాంగ్ నన్షాన్ తెలిపాడు. ఇటీవల మళ్ళీ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగగానే అధికారులు వీటి కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేవలం 25 రోజుల్లో 100 మిలియన్ డోసుల నుంచి 200 మిలియన్ డోసులను ఇచ్చినట్టు హెల్త్ కమిషన్ వెల్లడించింది.

 

మరిన్ని  ఇక్కడ చూడండి: Gold And Silver Price: మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి… ( వీడియో )

Viral Video: సరదాగా ప్రేమ డైలాగ్ చెప్పిన భర్త.. కత్తిపట్టుకుని వెంబడించిన భార్య.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

Follow us