Viral Video: ఆకలితో దొంగలా కిచెన్ లో దూరిన ఏనుగు…!! చివరికి ఏమైందంటే…?? ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 23, 2021 | 12:31 AM

ఆకలి..ఆకలే ! మనుషులైనా..జంతువులైనా .. ఒకటే మరి ! థాయిలాండ్ లో ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఒకరి ఇంటి కిచెన్ లోకి ఎంటరైంది.

ఆకలి..ఆకలే ! మనుషులైనా..జంతువులైనా .. ఒకటే మరి ! థాయిలాండ్ లో ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఒకరి ఇంటి కిచెన్ లోకి ఎంటరైంది. గోడను తన తొండంతో ఎలా నాశనం చేసిందో గానీ.. ఎంచక్కా తన తల అందులో దూరేలా రంధ్రం చేసేసింది. అందులోనుంచి తలను జొప్పించి కింద ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉన్న బియ్యాన్ని లాగించేసింది. నిన్న తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎదో అలికిడి అవుతున్నట్టు గమనించిన ఆ ఇంటి దంపతులు నిద్ర లేచి చూసేసరికి ఈ ‘ఏనుగమ్మ’ నిర్వాకం కనిపించింది. ఫుడ్ ని లాగించేస్తున్న గజరాజును చూసి షాక్ తిన్న వారు.. ఎలాగోలా అతి కష్టం మీద దాన్ని బయటకు వెళ్లగొట్టగలిగారు. అదృష్ట వశాత్తూ అది వారిపై దాడి చేయకుండా దగ్గరలోని చెట్లు, గుట్టల వద్దకు వెళ్ళిపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Whatsapp UPI Payment: వాట్సాప్‌ నుండి డబ్బులు పంపించటం ఈ సింపుల్ టిప్స్ తో సాధ్యం.. ( వీడియో )

Samantha Akkineni:వ్యాపార రంగంలోకి సమంత… అక్కినేని వారి కోడలు మరో అడుగు.. ( వీడియో )