Beluga Whales: మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలం పాట.. 4 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యం

Beluga Whales: వేలం .. అంటే.. ఇష్టమైన వస్తువులను దక్కించుకోవడానికి లేదా చీటీ డబ్బుల కోసం అనే తెలుసు. అయితే ఐపిఎల్ వంటివి వచ్చిన తర్వాత క్రీడాకారులను కూడా ఆక్షన్ లో...

Beluga Whales: మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలం పాట.. 4 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యం
Beluga Whales
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2021 | 8:01 PM

Beluga Whales: వేలం .. అంటే.. ఇష్టమైన వస్తువులను దక్కించుకోవడానికి లేదా చీటీ డబ్బుల కోసం అనే తెలుసు. అయితే ఐపిఎల్ వంటివి వచ్చిన తర్వాత క్రీడాకారులను కూడా ఆక్షన్ లో పెట్టేసి వేలం వేస్తున్నారు.. అయితే తాజాగా ఓ అక్వేరియం యజమాని చేపలకు పేర్లు పెట్టేందుకు వేలం పాటను నిర్వహిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో జరగనుంది. వివరాలోకి వెళ్తే..

సీ రీసెర్చ్ ఫౌండేషన్‌లో భాగమైన మిస్టిక్ అక్వేరియం వారు మూడు షార్క్ చేపలకు పేర్లు పెట్టేందుకు వేలం పాటను నిర్వహించనున్నారు. ఈ వేలం ఆగష్టు 19న జరగనుంది. మిస్టిక్ అక్వేరియం కెనడాలోని బెలుగా జాతికి చెందిన మూడు తిమింగాలను న్యూయార్క్‌ కి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కేలా, జూనో, నటాషా లను న్యూయార్క్ కు తీసుకుని రావడానికి సీ రీసెర్చ్ ఫౌండేషన్‌ కి ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు భారీగా అవ్వనున్నాయి. దీంతో ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చును సేకరించడం కోసం ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం ద్వారా కనీసం 4 మిలియన్ డాలర్లు సేకరించాలని అక్వేరియం నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే ఈ వేలంలో షార్క్ చేపలకు పేర్లు పెట్టడమే కాదు.. బోటు, వింటేజ్ కారుతో పాటు, పాతకాలపు వివిధ వస్తువులు కూడా ఉన్నాయి.

గతంలోనూ ఇతర జంతువులకు పేరు పెట్టాం, ప్రస్తుతం మూడు తిమింగలాను స్టేజ్ పేర్లతో పిలుస్తున్నాం. ఈ సారి వీటికి పేర్లు పెట్టే చాన్స్‌ను ప్రజలకు ఇస్తున్నాం. ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని సీ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సీఈవో స్టీఫెన్ కోన్ అన్నాడు. ఇక మిస్టిక్ అక్వేరియం ‘బెలుగా’ జాతి తిమింగాలుకు కేరాఫ్ కాగా, వీటి సంరక్షణ కోసం సంవత్సరానికి 5 మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా ఆహారం, పశువైద్య సంరక్షణ, ఆవాసాలు, పరిశోధనలను నిర్వహించడానికి దాదాపు 250,000 డాలర్లు ఏటా వెచ్చిస్తున్నారు.

Also Read: గుమ్మడి జ్ఞాపకాల్లో సావిత్రి దానగుణం.. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ పాఠం అని చెప్పిన వైనం..