Savitri Real Life: గుమ్మడి జ్ఞాపకాల్లో సావిత్రి దానగుణం.. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ పాఠం అని చెప్పిన వైనం

Savitri Real Life: పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.. అయితే కొందరు మరణించి చిరంజీవులు.. చరిత్ర పుటల్లో .. ప్రజల మనస్సులో .. వారు ఎప్పుడూ జీవించే ఉంటారు. అలాంటి మహనుభావుల్లో ఒకరు మహానటి సావిత్రి...

Savitri Real Life: గుమ్మడి జ్ఞాపకాల్లో సావిత్రి దానగుణం.. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ పాఠం అని చెప్పిన వైనం
Gummadi Savitri

Savitri Real Life: పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.. అయితే కొందరు మరణించి చిరంజీవులు.. చరిత్ర పుటల్లో .. ప్రజల మనస్సులో .. వారు ఎప్పుడూ జీవించే ఉంటారు. అలాంటి మహనుభావుల్లో ఒకరు మహానటి సావిత్రి. చిన్నవయసులోనే మరణించినా.. నేటికీ సావిత్రిని అవకాశం వచ్చినప్పుడల్లా ఆమెతో పరిచయం ఉన్నవారు తలచుకుంటూనే ఉంటారు.. పరిచయం లేనివారు.. సావిత్రి గురించి స్నేహితులు.. సన్నిహితులు.. సాయం అందుకున్నవారు చెప్పే మాటలను వింటూ.. ఆమె వ్యక్తిత్వానికి.. సాయం చేసే గుణానికి ముగ్ధులవుతారు.. అభిమానులుగా మారతారు.. అలనాటి మహోన్నత వ్యక్తి గురించి మరో దివంగత మహానటుడు గుమ్మడి ఎన్నో సార్లు ప్రస్తచాలా సందర్భాల్లో ప్రస్తావించారు.

సావిత్రి లాంటి మహా నటి మళ్లీ పుట్టాలంటే ఓ శతాబ్దం పడుతుందని ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఓ సందర్భంలో అన్నారు. సావిత్రి తనను అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. సావిత్రి జీవితం సినీ నటులకే కాదు.. అందరికీ ఓ గుణపాఠమని చెప్పారు. ‘సావిత్రి, సూర్యకాంతం తనను అన్నయ్య అనేవారని .. సావిత్రి జీవితంలో పడిన కష్టాల్ని ప్రత్యక్షంగా చూశానని చెప్పారు గుమ్మడి.

సావిత్రి చివరి రోజుల్లో.. గుమ్మడికి అనారోగ్యం చేసిందని అప్పుడు గుమ్మడిని చూడటానికి సావిత్రి వెళ్లారు. అయితే అప్పుడు గుమ్మడి మత్తులో ఉన్నారు.. సావిత్రి ఎంతో ప్రేమగా ‘ఎలా ఉన్నావు అన్నయ్య’ అని అడిగారు. అపుడు గుమ్మడి బాగున్నా అన్నట్లు తలవూపితే .. గుమ్మడి తలగడ సర్ది, వెళ్లినట్లు అనిపించిందట. దాని కింద చూస్తే రూ.2 వేలు ఉంది. అది సావిత్రి పెట్టి వెళ్లారు.  తర్వాత గుమ్మడి సావిత్రి కి ఫోన్ చేసి.. ఏంటమ్మా డబ్బు పెట్టి వెళ్లావ్‌ అని అడుగగా.. ‘ఓసారి మీ దగ్గర తీసుకున్నా అన్నయ్య. మర్చిపోయారా.. నేను ఎవరికీ అప్పుపడి ఉండకూడదు.నిన్నే వడ్డీ వాళ్లు వచ్చి రూ.5 వేలు ఇచ్చారు. అందులో రూ.2 వేలు తీసుకుని వచ్చా’ అని సావిత్రి చెప్పారు.. దీంతో గుమ్మడి కళ్ళు చెమ్మగిల్లాయి.

సావిత్రి వైభవం తగ్గింది..శరీరంలో మార్పులు వచ్చాయి.. దీంతో సినిమాలు తగ్గిపోయాయి. ఏదో సినిమాలో తల్లి పాత్ర చేస్తున్నారు. అందరికీ మామూలుగా ఇంటి నుంచి భోజనం వస్తుంది. అయితే అదే సమయంలో గుమ్మడికి ఇంటి నుంచి భోజనం వచ్చింది. సావిత్రికి ఇంటి నుంచి తీసుకొచ్చేవాళ్లు లేరు. సావిత్రి దూరంగా ఒక్కట్టే కూర్చొని ఉండగా.. గుమ్మడి వెళ్లి సావిత్రిని రామ్మా.. భోజనం చేద్దాం అని పిలిస్తే.. వద్దు అన్నయ్య అన్నారు.. అప్పుడు గుమ్మడి నువ్వు వస్తే కానీ నేను తినను అంటే.. అప్పుడు గుమ్మడి వద్దకు వెళ్లి సావిత్రి భోజనం చేశారు.. అప్పుడు సావిత్రి కంట కన్నీరు తిరిగిందని గుమ్మడి ఒక సందర్భంలో చెప్పారు

అంతేకాదు.. ‘సావిత్రి నా సినిమాలో ఉంటే చాలు’ అనుకున్న రోజుల నుంచి ఆమె స్థాయి నుంచి తగ్గగానే ప్రొడక్షన్‌ బాయ్స్‌ కూడా సావిత్రి ని పట్టించుకోలేదు. ఆర్టిస్టుల జీవితాల్లో ఇది విషాదకరమైంది. సావిత్రికి ఉన్న ఆస్తులు ఇప్పుడు వందల  విలువ చేస్తాయి. అలాంటిది ఆమె ఓ గ్యారేజీలో తన చివరి క్షణాల్ని గడిపారు. ఒకరకంగా సావిత్రి జీవితం అందరికీ గుణపాఠం. సావిత్రి జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సావిత్రి నటులు కానీ ప్రొడక్షన్ వారు కానీ స్నేహితులు ఇలా ఎవరూ ఏ రోజూ, ఎవరూ ఇబ్బంది పడలేదు. చిన్నవారిని కూడా గౌరవించి మాట్లాడేవారు సావిత్రి.. చివరికి సావిత్రి జీవితం ఎలాంటి కష్టం లో ముగిసిందో అందరికీ తెలుసు… సావిత్రి లాంటి నటి పుట్టాలంటే ఓ శతాబ్దం పడుతుంది’ అని దివంగత గుమ్మడి ఒకానొక సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

Also Read: కరోనా నిబంధనలతో జరుగుతున్న శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు

Click on your DTH Provider to Add TV9 Telugu