MAA Elections: ‘మా’ లో తీన్ మార్.. సీన్‌లోకి జీవితా రాజ‌శేఖ‌ర్.. రాజుకుంటున్న రాజకీయం..

MAA Elections: తెలుగు సినిమా నటీనటుల సంఘం `మా` అధ్య‌క్ష ఎన్నిక‌లు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎన్నిక‌ల వ్య‌వ‌హారం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో...

MAA Elections: ‘మా’ లో తీన్ మార్.. సీన్‌లోకి జీవితా రాజ‌శేఖ‌ర్.. రాజుకుంటున్న రాజకీయం..
Maa Elections
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 22, 2021 | 7:49 PM

MAA Elections: తెలుగు సినిమా నటీనటుల సంఘం `మా` అధ్య‌క్ష ఎన్నిక‌లు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎన్నిక‌ల వ్య‌వ‌హారం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌కాశ్ రాజు, మంచు విష్ణు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అధ్య‌క్ష ఎన్నిక‌ల బరిలోకి జీవిత రాజ‌శేఖ‌ర్ కూడా దిగ‌నున్నారు. తాజాగా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ మ‌ద్ద‌తుతో ప్ర‌కాశ్ రాజు బ‌రిలోకి దిగుతుండ‌గా.. మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు పోటీ చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం జీవిత రాజ‌శేఖ‌ర్ పోటీలోకి వ‌స్తుండ‌డంతో మా ఎన్నిక‌లు త్రిముఖ పోటీగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రెగ్యుల‌ర్ రాజ‌కీయ‌ల‌ను త‌ల‌పిస్తోన్న మా ఎన్నిక‌లు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

ఇదిలా ఉంటే మా అధ్యక్ష బ‌రిలోకి హీరో మంచు విష్ణు దిగుతున్న విష‌యం తెలిసిందే. విష్ణు త్వ‌ర‌లోనే త‌న ప్యాన‌ల్ స‌భ్యుల‌ను ప్ర‌క‌టించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న న‌రేష్ మ‌ద్ద‌తు విష్ణుకు ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక మోహ‌న్ బాబు కూడా ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో ఈ విష‌య‌మై చ‌ర్చించారు కూడా. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక అధ్య‌క్ష ఎన్నిక‌కు పోటీ చేస్తున్న‌ట్లు న‌టుడు ప్రకాశ్ రాజ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్రకాశ్ రాజ్‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇక తాజాగా జీవిత రాజ‌శేఖ‌ర్ కూడా పోటీలోకి దిగ‌నున్న నేప‌థ్యంలో పోటీ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఈ పోటీ త్రిముఖ పోటీగా మారుతుందా.. లేదా ఎవ‌రైనా మ‌ధ్య‌లో విత్‌డ్రా అవుతారా? వేచి చూడాలి.

Also Read: Savitri Real Life: గుమ్మడి జ్ఞాపకాల్లో సావిత్రి దానగుణం.. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ పాఠం అని చెప్పిన వైనం

Sonu Sood: ‘గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?’ నెటిజన్‌ రిక్వెస్ట్‌కు సోనూసూద్‌ క్రేజీ రిప్లై

Saranga Dariya: నెమలి లాంటి నాట్యం, కోయిల లాంటి గాత్రం.. ఎన్నో రికార్డులు దాసోహం.. తాజాగా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!