Tollywood: బొమ్మ పడేదెప్పుడు..? తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ స్క్రీన్స్‌కి మోక్షమెప్పుడు?

నిన్నటిదాకా సైలెంట్‌గా వున్న టాలీవుడ్‌లో సడన్‌గా సందడి మొదలైంది. చిన్నా పెద్దా సినిమాలన్నీ షూటింగ్స్‌ని జబర్దస్త్‌ రీస్టార్ట్ చేసుకుంటున్నాయి. మెగాస్టార్, సూపర్‌స్టార్, ఐకాన్ స్టార్...

Tollywood: బొమ్మ పడేదెప్పుడు..? తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ స్క్రీన్స్‌కి మోక్షమెప్పుడు?
theaters

నిన్నటిదాకా సైలెంట్‌గా వున్న టాలీవుడ్‌లో సడన్‌గా సందడి మొదలైంది. చిన్నా పెద్దా సినిమాలన్నీ షూటింగ్స్‌ని జబర్దస్త్‌ రీస్టార్ట్ చేసుకుంటున్నాయి. మెగాస్టార్, సూపర్‌స్టార్, ఐకాన్ స్టార్… ఇలా అందరూ మేకప్ వేసుకునేందుకు రెడీ ఔతున్నారు. మరి.. సినిమా థియేటర్ల సంగతేంటి? తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ స్క్రీన్స్‌కి మోక్షమెప్పుడు? తెలుసుకుందాం పదండి.  తెర తియ్యడమా.. వద్దా..? ఎగ్జిబిటర్ సెక్టార్‌లో ఇదే డైలమా నడుస్తోందిప్పుడు. రెండోసారి కుదేలైన తెలుగు సినిమాకు అచ్చేదిన్‌ ఎప్పుడన్న ప్రశ్న.. ఇంకా ప్రశ్నగానే వుంది. తెలంగాణా సరే పూర్తిగా అన్‌లాక్ అయింది.. జూలై 1 నుంచి సినిమా థియేటర్ల రీఓపెనింగ్‌కి గో ఎహెడ్ చెప్పేసింది కేసీఆర్ సర్కార్. కానీ.. ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా వుంది. మరో రెండువారాల వరకూ.. థియేటర్ల మీద నజర్ పెట్టే అవకాశాలే లేవు.

జూలై సెకండాఫ్‌కల్లా టోటల్ సిట్యువేషన్ కంట్రోల్లోకొస్తుందన్నది ఇండస్ట్రీలో కొందరికుండే కాన్ఫిడెన్స్‌. తమ సినిమా కూడా అప్పుడే రిలీజ్ చేస్తామని ఓపెన్‌గా చెప్పేశారు లవ్‌స్టోరీ ప్రొడ్యూసర్లు. అటు.. టక్ జగదీశ్ నుంచి కూడా ఈసారి బిగ్‌స్క్రీన్‌ మీద ఫస్ట్ షో తమదేనన్న ఫీలర్స్ వున్నాయి. అటు రీరిలీజ్‌ల కోసం కూడా క్యూ కట్టేశాయి తాజామాజీ సినిమాలు. దాదాపు 200 థియేటర్లలో సెకండ్ రిలీజ్‌కి రెడీగా వుంది వకీల్‌సాబ్ మూవీ. రవితేజ క్రాక్ సినిమా అయితే.. ఇప్పటికే థియేటర్ల లిస్ట్ కూడా ఫైనలైజ్ చేసుకున్నట్టు ఇండికేషన్స్ వున్నాయి.

ఒకవేళ జూలై ఫస్ట్‌వీక్‌లో ఏపీలో కూడా నైట్‌ కర్ఫ్యూ ముగిసి.. అన్‌లాక్ అయినా.. షో వెయ్యడానికి రెడీగా లేరు థియేర్ ఓనర్లు. రాయితీలు కావాలంటూ వాళ్లు పెట్టిన డిమాండ్లు ప్రభుత్వాల దగ్గర పెండింగ్‌లోనే వున్నాయి. బుక్‌మైషో లాంటి టికెటింగ్ సర్వీస్ కంపెనీలు, కొన్ని బిగ్ సైజ్ మల్టీప్లెక్స్‌లు నష్టాల్ని భరించలేక.. వందలకొద్దీ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఇక సింగిల్‌ స్క్రీన్ ఓనర్ల పరిస్థితి అగమ్యగోచరం. కోవిడ్ రెండు సార్లు దెబ్బకొట్టిన కోవిడ్‌తో 200 థియేటర్లు మూతబడ్డట్టు ఒక లెక్క తేలింది. ఇవన్నీ క్లియర్ కావాలంటే ఆగస్టు వరకూ వెయిటింగ్ తప్పదంటున్న గెస్ నడుస్తోంది టాలీవుడ్‌లో.

Also Read:  ‘గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?’ నెటిజన్‌ రిక్వెస్ట్‌కు సోనూసూద్‌ క్రేజీ రిప్లై

నెమలి లాంటి నాట్యం, కోయిల లాంటి గాత్రం.. ఎన్నో రికార్డులు దాసోహం.. తాజాగా

Click on your DTH Provider to Add TV9 Telugu