FIR: సీఎం కేసీఆర్, హోంమంత్రిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు..

Hyderabad Cyber Crime Complaint: తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు, హోంమంత్రి మ‌హ‌మూద్ అలీపై అస‌భ్య‌క‌ర‌ రీతిలో వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తిపై హైద‌రాబాద్ సైబ‌ర్‌ క్రైం పోలీసులు

FIR: సీఎం కేసీఆర్, హోంమంత్రిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు..
Social-Media

Hyderabad Cyber Crime Complaint: తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు, హోంమంత్రి మ‌హ‌మూద్ అలీపై అస‌భ్య‌క‌ర‌ రీతిలో వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తిపై హైద‌రాబాద్ సైబ‌ర్‌ క్రైం పోలీసులు కేసు న‌మోదు చేశారు. కిష‌న్‌బాగ్‌కు చెందిన‌ హ‌కీం సుఫీషా కైరుద్దీన్‌పై.. స‌యీద్ లాయ‌క్ అలీ ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసి చ‌ర్య‌లు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కైరుద్దీన్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా సీఎం కేసీఆర్‌, హోంమంత్రి మ‌హ‌మూద్ అలీపై అస‌భ్య‌కరంగా వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేశాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు కైరుద్దీన్‌పై ఐపీసీ సెక్ష‌న్ 504 కింద కేసు న‌మోదు చేశారు.

అయితే.. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్, హోంమంత్రిపై కైరుద్దీన్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

TS Irrigation Department: అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు.. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు

Ancient Shiva Lingam: పొలం పనుల కోసం తవ్వకాలు.. బయల్పడిన అతి పురాతన శివలింగం