Ancient Shiva Lingam: పొలం పనుల కోసం తవ్వకాలు.. బయల్పడిన అతి పురాతన శివలింగం

Ancient Shiva Lingam: ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారత దేశం.. మనదేశంలో అనేక పురాతన పుణ్యక్షేత్రాలు.. ప్రకృతి నడుమ కొండకోనల్లో అనేక ఆలయాలు ఉన్నాయి..

Ancient Shiva Lingam: పొలం పనుల కోసం తవ్వకాలు.. బయల్పడిన అతి పురాతన శివలింగం
Shiva
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2021 | 9:03 PM

Ancient Shiva Lingam: ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారత దేశం.. మనదేశంలో అనేక పురాతన పుణ్యక్షేత్రాలు.. ప్రకృతి నడుమ కొండకోనల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా జరిపిన తవ్వకాలలో పురాతన శివలింగం బయటపడ్డది. జంగాల కండ్రిగ గ్రామంలో పొలం పనులు చేయడం కోసం చేపట్టిన తవ్వకాల్లో ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. షేక్ రఫీ అనే రైతు తన మామిడి తోటలో చెట్లు తొలగిస్తుండగా శివలింగం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు శివలింగాన్ని చూడడానికి బారులు తీరారు. ఇది పురాతనమైన శివలింగం అని అంటున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చారు.

అయితే ఇటీవలే నెల్లూరు జిల్లాలో ఇసుక కోసం జరిపిన తవ్వకాల్లో కూడా శివాలయం వెలుగులోకి వచ్చింది. అతిపురాతన శివాలయాలు గత చరిత్రకు అనవాళ్లుగా నిలుస్తున్నాయని అధికారులు అంటున్నారు. ఎంతో మహిమాన్వితమైన శివాలయాలను ప్రభుత్వాలు పట్టించుకుని పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read: గుమ్మడి జ్ఞాపకాల్లో సావిత్రి దానగుణం.. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ పాఠం అని చెప్పిన వైనం..