చాణక్య నీతి: ప్రపంచంలో డబ్బుకంటే విలువైన మూడు విషయాలు ఉన్నాయి.. అవి ఏమిటంటే..
Chanakya Niti: సాధారణంగా డబ్బుంటే చాలు అని అందరూ అనుకుంటారు. డబ్బుతో ప్రపంచం ముడిపడి ఉందని భావిస్తారు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటారు.
Chanakya Niti: సాధారణంగా డబ్బుంటే చాలు అని అందరూ అనుకుంటారు. డబ్బుతో ప్రపంచం ముడిపడి ఉందని భావిస్తారు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటారు. మనకు వచ్చే ఎటువంటి సమస్య అయినా డబ్బు సులభంగా పరిష్కరించేస్తుందని అందరూ నమ్ముతారు. ఇది అక్షరసత్యం కూడా అని చాలా సార్లు రుజువైంది. అదేవిధంగా ఆచార్య చాణక్య కూడా డబ్బు ప్రాధాన్యత చాలా ఎక్కువని వివరించారు. డబ్బు చాలా ముఖ్యమైనదిగా ఆయన వివరించారు. అంతేకాకుండా సంపదను నిల్వ చేసుకోవడం గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే, డబ్బుకంటే కూడా మూడు విషయలు ప్రపంచంలో చాలా గొప్పవని చాణుక్యుడు అంటారు. ఆ మూడు ముఖ్యమైన విషయాలకోసం డబ్బు మొత్తం ఖర్చు అయిపోయినా బాధ పడకూడదని ఆయన వివరిస్తారు.
డబ్బు పొతే, కష్టపడి సంపాదించవచ్చు.. కానీ, ఈ మూడు విషయాలు కోల్పోతే మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ తిరిగి తీసుకురాలేమని ఆచార్య చాణక్య కచ్చితంగా చెప్పారు. ఆచార్య చాణక్య అన్నికాలాల్లో మానవులు ఎలా ఉండాలో బోధ చేసిన వారు. ఆయన ఎప్పుడో చెప్పిన ప్రతి విషయం ఇప్పటికీ మనకు దారి చూపించేవిగానే ఉంటాయి. ఆచార్య చాణక్య డబ్బు కంటె..ముఖ్యమైనవి అని చెప్పిన మూడు విషయాలు ఏమిటో.. వాటి పాధాన్యత ఏమిటో తెలుసుకుందాం.
1- మతం: డబ్బు కంటే మతం పెద్దది. ఏదైనా పొందాలనే ముసుగులో ఎప్పుడూ మతాన్ని వదులుకోకూడదు. మన తప్పొప్పులను గుర్తించడానికి మతం మనకు సరైన దారిని బోధిస్తుంది. మతాన్ని అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మతం మార్గంలో డబ్బు వస్తే, అటువంటి డబ్బును తిరస్కరించడం మంచిది. మతం ఎప్పుడూ మంచే చేస్తుంది. కానీ డబ్బు చెడునూ మూటగట్టి ఇస్తుంది.
2- సంబంధాలు: నిజమైన సంబంధాలు కనుగొనడం ప్రపంచంలో చాలా కష్టం. ఒక వ్యక్తి మిమ్మల్ని హృదయం నుండి చాలా ప్రేమిస్తాడు. అతను మీ నిజమైన స్నేహితుడు అయితే, అలాంటి వ్యక్తుల ముందు డబ్బుకు విలువ ఉండదు. మీరు ప్రపంచంలోని అన్ని ఆనందాలను డబ్బుతో కొనుగోలు చేయవచ్చు, కానీ, మీరు ఒకరి ప్రేమను కొనలేరు. మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తి మీ ఆనందంలోనూ.. దుఃఖంలోనూ మీకు మద్దతు ఇస్తాడు. మీకు డబ్బు లేనప్పుడు కూడా, ఆ వ్యక్తి ఎప్పటికీ మీకు అండగా నిలుస్తాడు. అటువంటి నిజమైన స్నేహితుడు, శ్రేయోభిలాషి లేదా బంధువు కోసం డబ్బును మీరు వదులుకోవాల్సి వస్తే వదిలేసుకోవాలి అని చెబుతారు చాణక్య. మానవ సంబంధాల ముందు డబ్బు ఎందుకూ పనికిరానిదని ఆయన చెప్పారు.
3- ఆత్మగౌరవం: ప్రపంచంలోని ఏ వ్యక్తికైనా, అతని ఆత్మగౌరవం కంటే గొప్పది ఏమీ ఉండకూడదు. ఆత్మగౌరవాన్ని కాపాడటానికి మీరు డబ్బును త్యాగం చేయవలసి వస్తే, అప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా డబ్బును వదిలేయాలి.. మీరు కోల్పోయిన డబ్బును మళ్ళీ సంపాదించవచ్చు, కాని విశ్వాసం.. మీ గౌరవం దెబ్బతిన్నట్లయితే దాన్ని తిరిగి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది.
Chanakya Niti: ఆచార్య చాణక్య ఇల్లు నిర్మించుకోవాలంటే ఎటువంటి ప్రదేశం.. వాతావరణం ఉండాలని చెప్పారంటే..