Chanakya Niti: ఆచార్య చాణక్య ఇల్లు నిర్మించుకోవాలంటే ఎటువంటి ప్రదేశం.. వాతావరణం ఉండాలని చెప్పారంటే..
Chanakya Niti: ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడు. దీనితో పాటు ఆయనకు నీతిశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన విధానాలు కాలం మారినా చెక్కు చెదరనివి. ప్రతి మానవుడూ ఆచరించ దగ్గవి.
Chanakya Niti: ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడు. దీనితో పాటు ఆయనకు నీతిశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన విధానాలు కాలం మారినా చెక్కు చెదరనివి. ప్రతి మానవుడూ ఆచరించ దగ్గవి. కాలంతో పాటు ఆచార్య చాణక్య విధానాలు కూడా నడుస్తోనే ఉంటాయి. ఆచార్య చాణక్య తన విధానాలను జీవితంలోని ప్రతి అంశంపై ప్రస్తావించారు. ఏ వ్యక్తి అయినా వారి విధానాలను అనుసరించి విజయవంతమైన,సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటారు. ఆయన ప్రస్తావించిన విషయాల్లో ఇంటి గురించి.. భూమి గురించి కొన్ని ప్రత్యెక విషయాలు ఉన్నాయి. ఇల్లు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన అప్పట్లోనే విస్పష్టంగా తెలిపారు. అవి ఈరోజుకూ అమోదయోగ్యంగానూ,ఆచరణ యోగ్యంగానూ ఉంటాయి.
ఇల్లు కొనడం గురించి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి..
ధనవంతులు నినివసించే చోట..
ధనవంతులు నివసించే ప్రాంతాల్లో నివసించడం చాలా మంచిది అని చాణక్యుడు చెప్పాడు. అటువంటి ప్రదేశంలో వ్యాపరావకాశాలు ఎక్కువ ఉంటాయట. అదేవిధంగా ధనవంతులు నివసించే ప్రాంతంలో నివసిస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయని చాణక్యుడు చెబుతారు.
మత విశ్వాసాలు..
మత విశ్వాసాలు పాటించే ప్రాంతంలోనూ.. భగవంతుని పై భయం ఉన్న చోట ఇంటిని నిర్మించుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. దీనివలన ప్రజలు భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి జీవిస్తారు. ప్రజలలో సామాజిక గౌరవం పెరుగుతుంది. సంస్కారయుతంగా మెలగడం నేర్చుకుంటారు. అందుకని అటువంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మించుకోవడం మంచిదని ఆచార్య చాణక్య చెబుతారు.
చట్టం అంటే భయం ఉన్న చోటు..
ప్రజలు చట్టం మరియు సమాజం పట్ల భయపడే చోట ఒక వ్యక్తి నివసించాలని చాణక్య అంటారు. ఈ రెండింటి విషయంలో భయం లేని వ్యక్తుల మధ్య ఎట్టిపరిస్థతిలోనూ ఉండకూడదని చాణక్య ఉవాచ. దానివలన మంచి వ్యక్తులు కూడా చిక్కుల్లో పడాల్సి వస్తుంది.
వైద్యులు ఉన్న ప్రదేశానికి దగ్గరగా..
ఆచార్య చాణక్య సమీపంలో వైద్యులు లేదా వైద్యులు ఉన్నచోట నివాసానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెబుతారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే.. అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే కాపాడటానికి వైద్యులు దగ్గరలో ఉండాల్సిన అవసరం ఉంది.
నదికి దగ్గరలో..
నదికి దగ్గరలో మనిషి జీవించడం చాలా ముఖ్యం అంటారు ఆచార్య చాణక్య. ఎందుకంటే, అక్కడ ఇల్లు ఉంటె.. మంచి వాతావరణం లభిస్తుంది. పర్యావరణం ప్రశాంతంగా ఉంటుంది. అంటారు చాణక్య.