- Telugu News Photo Gallery Science photos Nasas juno spacecraft snaps first close ups of jupiters largest moon called ganymede
Jupiter Largest Moon: గనిమీడ్కు అత్యంత దగ్గరకు వెళ్లిన జునో.. అద్భుత ఫోటోలను పంపింది..
నాసా ప్రయోగించిన జునో స్పేస్ క్రాఫ్ట్ విజయంలో తొలి అడుగు ఫలిచింది. నాసా ప్రయోగించిన జునో స్పేస్‌క్రాఫ్ట్.. బృహస్పతి ఉపగ్రహం గనిమీడ్ ఫోటోలను తీసింది. ఇందులో కెమెరా రెడ్, బ్లూ ఫిల్టర్ వెర్షన్ వివరాలు రాగానే.. ఈ ఫొటో కలర్ ఇమేజ్ను నిపుణులు తయారు చేస్తారు. గనిమీడ్కు సంబంధించి త్వరలో మరిన్ని ఫొటోలను జునో పంపించనుంది.
Updated on: Jun 09, 2021 | 9:20 PM

నీటి లభ్యతను తెలుసుకోవడంతోపాటు దానిపై జీవం ఉనికిని కనుగొనడం కోసం నాసా ఈ ప్రయోగం చేపట్టింది. 2011 ఆగస్టు 5న అంతరిక్ష యాత్ర మొదలుపెట్టిన జునో దాదాపు 280 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి గురు గ్రహ కక్ష్యలోకి చేరింది.

స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉన్న జునోక్యామ్ విజిబుల్ లైట్ ఇమేజర్ ఈ ఫొటోలను తీసింది. ఉపగ్రహం ఓ భాగాన్ని పూర్తిగా ఫొటోలలో బంధించింది. కెమెరా రెడ్, బ్లూ ఫిల్టర్ వెర్షన్ వివరాలు రాగానే.. ఈ ఫొటో కలర్ ఇమేజ్ను నిపుణులు తయారు చేస్తారు. గనిమీడ్కు సంబంధించి త్వరలో మరిన్ని ఫొటోలను జునో పంపించనుంది.

బృహస్పతి ఉపగ్రహం గనిమీడ్కు చెందిన స్పష్టమైన చిత్రాలను నాసా స్పేస్‌క్రాఫ్ట్ పంపించింది. ఉపగ్రహ ఉపరితలం స్పష్టంగా కనిపించేలా ఈ ఫొటోలు ఉన్నాయి. త్వరలో మరిన్ని చిత్రాలను స్పేస్‌క్రాఫ్ట్ పంపించనుంది.

నాసా ప్రయోగించిన జునో స్పేస్‌క్రాఫ్ట్.. బృహస్పతి ఉపగ్రహం గనిమీడ్ చిత్రాన్ని బంధించింది. గనిమీడ్కు అత్యంత దగ్గరకు వెళ్లిన జునో.. రెండు ఫొటోలను భూమి మీదకు పంపించింది. ఈ ఫొటోలు అత్యంత స్పష్టతతో ఉండటం విశేషం.

గనిమీడ్ ఉపరితలాన్ని ఈ ఫొటోల ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ఉపగ్రహంపై ఉన్న బిలాలు, నల్లటి ఉపరితలాలు ఇందులో కనిపిస్తున్నాయి.

ఈ జనరేషన్లో గనిమీడ్కు అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ ఇదే. అయితే ఈ ఫొటోల ద్వారా శాస్త్రీయంగా ఎలాంటి నిర్ణయానికి రావడం లేదు. కానీ, ఈ అద్భుతమైన ఫొటోలను అలా చూస్తూ ఉండిపోవచ్చు.




