- Telugu News Photo Gallery Science photos Solar eclipse 2021 here are the do s and do not to follow on the day of eclipse 10 june
Solar Eclipse-2021: సూర్యగ్రహణాన్ని ఎలా చూడాలి?.. ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు..
Solar Eclipse-2021: సూర్యగ్రహణంలో ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఖగోళ సంఘటనలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న చాలా మంది తమ కెమెరాతో సూర్యగ్రహణం యొక్క చిత్రాలను తీసేందుకు ప్రయత్నిస్తారు.
Updated on: Jun 10, 2021 | 7:28 AM

Solar Eclipse-2021: జూన్ 10వ తేదీన అంటే గురువారం నాడు, ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం జరగబోతోంది. ఉత్తర అమెరికా, యూరప్ మరియు ఆసియాలో ఎక్కువ భాగం పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే ఇది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ యొక్క ఈశాన్య ప్రాంతాలలో మాత్రమే కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 11:42 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది. మధ్యాహ్నం 3:30 నుండి గ్రహణ స్వరూపం పెరుగుతూ.. సాయంత్రం 4:52 గంటలకు 'గోల్డెన్ రింగ్' లాగా ఆకాశంలో కనిపిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో ఏం చేయాలి?.. ఏం చేయకూడదు?.. ఇప్పుడు తెలుసుకోండి.

ఈ విధంగా, సూర్యగ్రహణం సమయంలో గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రకారం.. ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ని చూడటానికి ప్రత్యేక సౌర ఫిల్టర్లను, 'ఎక్లిప్స్ గ్లాస్' ఉపయోగించాలి.

సూర్యగ్రహణంలో ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఖగోళ సంఘటనలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న చాలా మంది తమ కెమెరాతో సూర్యగ్రహణాన్ని బంధించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, అలా చేయొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు కళ్లను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని, ప్రత్యేక అద్దాలను ఉపయోగించి ఫోటోగ్రఫి చేయవచ్చు అని పేర్కొన్నారు.

కంటి చూపు తక్కువగా ఉన్నవారు.. అప్పటికే అద్దాలు కలిగి ఉన్న వారు.. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక అద్దాలను వినియోగించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఇంట్లోని పిల్లలు గ్రహణాన్ని చూడాలనుకుంటే.. పెద్దల సమక్షంలోనే దానికి చూడాలి.

సూర్యగ్రహణం సమయంలో పగటి పూట కూడా చీకటిగా మారుతుంది. ఈ నేపథ్యంలో రోడ్లపై బైక్‌లు, కార్లు, ఇతర వాహనాలు నడుపుతున్న ప్రజలు హెడ్‌లైట్‌లతో డ్రైవ్ చేయాలని సూచించారు. తద్వారా ఎలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం లేదన్నారు. అలాగే ఇతర వాహనాలకు మధ్య దూరం పాటించాలని సూచిస్తున్నారు.




