- Telugu News Photo Gallery Technology photos Technology new feature google meet introduces background themes for web version
Google Meet: గూగుల్ మీట్‌లో మరో అద్భుత ఫీచర్.. యూజర్ ఇక నుంచి తమకు నచ్చిన..
Google Meet: గూగుల్ మీట్ సిరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు తమకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోవచ్చు. ఇది యూజర్ల ప్రైవసీని కాపాడటానికి సహాయపడుతంది.
Updated on: Jun 09, 2021 | 4:53 AM

డిఫాల్ట్ మరియు కస్టమ్ వాల్‌పేపర్‌ల తరువాత, గూగుల్ మీట్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వెబ్ మీటింగ్‌లో పాల్గొనే వారికోసం.. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ను సెట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం వెబ్‌కు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలో మొబైల్‌లో ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు.

గూగుల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఫీచర్‌ను మొదట పునరుద్ధరించిన గూగుల్ మీట్ వెబ్ యుఐతో పాటు ప్రకటించారు. దీనిని మరింత విస్తృతంగా రూపొందించారు.

ఇప్పుడు యూజర్లు వీడియో మీటింగ్ సందర్భాల్లో బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్‌నే కాకుండా ఇప్పుడు వీడియోను కూడా ఎంపిక చేసుకోవచ్చు. మీకు నచ్చిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ని సెట్ చేసుకోవచ్చు.

యూజర్లు తమ బ్యాక్‌గ్రౌడ్ థేమ్‌ని వీడియో ద్వారా కవర్ చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందని గూగుల్ చెబుతోంది. ఇది వీడియో కాల్స్‌ని మరింత సరదాగా మారుస్తుందంటున్నారు. కాగా, తరగతి గది, పార్టీ, అడవి, మరికొన్ని బ్యాక్‌గ్రౌండ్ థీమ్ వీడియోలు ఉన్నాయని గూగుల్ తెలిపింది.

జూన్ 7వ తేదీ నుంచి వెబ్‌లో మొదట ప్రారంభించారు. జూన్ 30 నుండి, వీడియో, ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లకు గూగుల్ క్రోమ్ వెర్షన్ 87 అవసరం అని గూగుల్ తెలిపింది.




