Zodiac Signs: మీ రాశి చక్రాన్ని బట్టి మీ తోబుట్టువులతో అనుబంధం ఎలా ఉంటుందో చెప్పవచ్చు.. ఎలానో ఇక్కడ తెలుసుకోండి

Zodiac Signs: మన తోబుట్టువులను ప్రేమించడం మన బాధ్యత. చిన్నప్పటి నుంచీ.. కలిసి తింటాం.. కలిసి ఆడుకుంటాం.. తిట్టుకుంటాం.. పోట్లాడుకుంటాం.. కానీ, ఎప్పుడూ కలసి ఉండాలనే కోరుకుంటాం.

  • Updated On - 8:34 pm, Tue, 22 June 21
Zodiac Signs: మీ రాశి చక్రాన్ని బట్టి మీ తోబుట్టువులతో అనుబంధం ఎలా ఉంటుందో చెప్పవచ్చు.. ఎలానో ఇక్కడ తెలుసుకోండి
Zodiac Signs

Zodiac Signs: మన తోబుట్టువులను ప్రేమించడం మన బాధ్యత. చిన్నప్పటి నుంచీ.. కలిసి తింటాం.. కలిసి ఆడుకుంటాం.. తిట్టుకుంటాం.. పోట్లాడుకుంటాం.. కానీ, ఎప్పుడూ కలసి ఉండాలనే కోరుకుంటాం. చిన్నతనంలో ఏకారణం చేతనైనా మన తోబుట్టువులతో గొడవ జరిగినా.. వారు ఒక్క పదినిమిషాలు కనిపించకపోతే అస్సలు ఉండలేం. అదే రక్త సంబంధం. తోబుట్టువులతో మన బంధం ప్రత్యేకమైనది. అయితే, అన్ని విషయాల లానే ఇక్కడా కూడా మనిషి నైజం మీద ఈ తోబుట్టువులతో కొనసాగించే సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా జాతకరీత్యా కూడా ఆయా రాశి ఫలాన్ని బట్టి తోబుట్టువులతో మన సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయని జాతక నిపుణులు చెబుతారు. ఇప్పుడు మీ రాశి చక్రం ప్రకారం మీరు తోబుట్టువులతో ఎలా ఉంటారో ఇక్కడ తెలుసుకోవచ్చు..

మేషం

మేష రాసి వారు ఇతరులను చాలా సులభంగా బాధపెట్టేస్తారు. అయితే, తోబుట్టువుల విషయంలో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వీరు తమ వ్యక్తిత్వాన్ని ఎంత ప్రేమిస్తారో వారి తోబుట్టువులను అంతగానూ ప్రేమిస్తారు. కుటుంబ సమావేశాల్లో వీరు అందరి మధ్యలో అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తులుగా నిలవడానికి ఇది సహకరిస్తుంది.

వృషభం

వీరు మొండి పట్టుదలగలవారు. సాధారణంగా వీరు ఏ విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అవి దుస్తులైనా.. మరోటైనా.. ఎవరన్నా వీరి వస్తువులను తాకినట్టయితే వెంటనే వారితో గొడవకు దిగిపోతారు. తోబుట్టువులైనా ఈ విషయంలో ఎటువంటి మినహాయింపూ ఇవ్వరు. వీరు తమదైన దేనినీ పంచుకోవడానికి గానీ, వారితో కలిసి ఉండే ప్రయత్నానికి గానీ దూరంగా ఉంటారు. కానీ, తోబుట్టువుల విషయంలో ఇది తల్లిదండ్రులు ఉన్నంతవరకే. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినట్టయితే, వీరే తమ తోబుట్టువులకు తల్లిదండ్రులుగా మారిపోతారు. ప్రేమను పంచి ఇస్తారు.

మిథునం

ఈ రాశి వారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. చాలా సందర్భాల్లో ఎదుటివారిని హేళన చేయడం ద్వారా ఫన్ కోసం చూస్తారు. దీనికి తోబుట్టువులు మినహాయింపు కాదు. వారిని బాధించాలని కాకపోయినా, కేవలం నవ్వుల కోసమే ఏ ఎగతాళి మార్గాన్ని ఎంచుకుంటారు. దీనివలన తమ తోబుట్టువులను ఎక్కువసార్లు బాధపెడతారు మిధున రాశివారు. అదే సమయంలో వీరిపై వేసిన జోక్ లను వీరు ఆస్వాదించ లేరు.

కర్కాటకం

కర్కాటక రాశివారికి కుటుంబమే మొదటి ప్రాధాన్యత. వీరు సూపర్ ఎమోషనల్. తోబుట్టువులతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటారు. అలాగే, వారు తమతో సన్నిహితంగా మెలగాలని ఆశిస్తారు. ఈ విషయంలో విఫలం అయితే వీరు చాల నిరాశకు గురవుతారు. తోబుట్టువులను ప్రేమించడం విషయంలో కర్కాటక రాశి వారు ఎప్పుడూ ముందుంటారు.

సింహం

ఈ రాశి వారు బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడతారు. తమ పనులను ఒక నిర్దిష్ట మార్గంలో చేస్తారు. వీరు తోబుట్టువులను నిరాశపరిచే పనులు చేస్తారు. వారు కూడా బాధ్యతలు స్వీకరించాలని భావిస్తారు కానీ, అందుకు వారికీ అవకాశం ఇవ్వరు. ఎందుకంటే, వారు వాటిని సక్రమంగా నిర్వర్తించలేరనే భావనతో ఉంటారు.

కన్య

వీరు ఎక్కువగా ఎదుటివారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఎదుటి వారి ప్రతి పనినీ విమర్శిస్తూనే ఉంటారు. ఇది తోబుట్టువులతో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతిసారి తప్పులను ఎత్తి చూపిస్తుండటం వీరి తోబుట్టువులను రెచ్చగొడుతుంది. దీంతో వారు ఎప్పుడూ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు.

తుల

వీరికి కుటుంబంతో గొడవ పడటం అసలు ఇష్టం ఉండదు. దాంతో వీరి తోబుట్టువులు చేసిన పనులకు కూడా బాధ్యత తీసుకుంటారు. ఈ విధానం వలన సమస్యలలో పడుతుంటారు. ఒక్కోసారి వారి తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినపుడు చాలా నిరాశకు గురవుతారు. అయితే, వీరికి ఏదైనా సమస్య వచ్చిందంటే అప్పుడు మాత్రం తమ తోబుట్టువులను నిందించటానికి ఏమాత్రం వెనుకాడరు.

వృశ్చికం

వీరు తోబుట్టువులంటే ఎంత ఇష్టం ఉన్నా.. వారు చిన్న పొరపాటు చేసినా క్షమించరు. ఒక్కోసారి నెలల తరబడి వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. అదేవిధంగా ఒక్కోసారి తోబుట్టువులతో వచ్చిన స్పర్ధలతో వారి పట్ల శాశ్వత శత్రుత్వాన్ని పెంచేసుకుంటారు. ఇది వీరికి చెడు చేస్తుంది. కానీ, అవసరం అయితే, తోబుట్టువులను ఇబ్బందుల నుంచి రక్షించుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు.

ధనుస్సు

వీరు మనసులో ఉన్నది ఏదైనా బయటకు చెప్పేస్తారు. అది తోబుట్టువులకు సంబంధించిన విషయం అయినా నిర్మొహమాటంగా సూటిగా విషయం చెప్పేస్తారు. దీంతో వారు బాధపడతారు. మీరు నిజాయితీగా ఉన్నా మీ తోబుట్టువులు మిమ్మల్ని అర్ధం చేసుకోవడంలో పొరబాటు పడతారు. ఈ విషయంలో మిమ్మల్ని మీ తోబుట్టువులు ద్వేషించే అవకాశాలే ఎక్కువ. సాధారణంగా ఎవరికైనా కావలసింది స్వాంతన పరిచే మాటలే. మీ నిజాయితీ, నిర్మొహమాటం ఎవరికీ నచ్చవు. ప్రత్యేకించి ఈ రోజుల్లో.

మకరం

మకర రాశి వారు చాలా తెలివైన వారు. వారు ఎప్పుడూ ఆటలు ఆడటానికి ఇష్టపడతారు. అంటే, పోటీతత్వం ఎక్కువ. అదే పని తోబుట్టువుల విషయంలోనూ చేస్తారు. వారు మీ పై నెగెటివ్ అభిప్రాయాన్ని ఎర్పరుచుకుంటారు. మీరు అంత సరైన వారు కాదనే భ్రమలో ఉండిపోతారు. కానీ, మీరు ఎప్పటికప్పుడు మీ సంకల్ప బలంతో వారి అభిప్రాయం తప్పు అని నిరూపిస్తూ ఉంటారు.

కుంభం

వీరు ప్రతిదాన్నీ ఇష్టపడతారు. అయితే అందరితో విబెధిస్తూ ఉంటారు. ఎవరితోనూ మానసికంగా సంబంధం కలిగి లేరని అందరూ భావిస్తారు. కానీ ఈ రాశివారు తోబుట్టువులను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. అవసరం అయితే ప్రాణాలు ఇచ్చెంతగా వారు తోబుట్టువులను ప్రేమిస్తారు. కానీ, దీనిని వ్యక్తపరచడంలో వారికి చాలా ఇబ్బంది ఉంటుంది.

మీనం

వీరు తోబుట్టువులను బేషరతుగా ప్రేమిస్తారు, మరియు వారికి ఇష్టమైన విషయాలతో విలాసపరచడం వీరికి చాలా ఇష్టం. ఈ ఔదార్యం వీరికి అందరికీ ఇష్టమైన తోబుట్టువుగా అవార్డులు ఇస్తుంది. అందరిచేత ప్రేమించబడటం చాలా ఆనందంగా ఉంటుంది. వీరి స్వంత అవసరాలను తీర్చడానికి బదులుగా తోబుట్టువులను జాగ్రత్తగా చూసుకోవడంలో వీరికి సమస్య లేదు ఎందుకంటే కుటుంబ బంధం కోసం వీరు ఎప్పుడూ పరితపిస్తూ ఉంటారు.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు బంధాల నుంచి విడిపోవడం విషయంలో చాలా ఫాస్ట్.. ఏ రాశుల వారు..ఎందుకు అలా ఉంటారు?

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు మహా మొండివారు..వారితో వాదన కష్టం..ఏ రాశుల వారంటే..