ఈ నాలుగు రాశుల వారు బంధాల నుంచి విడిపోవడం విషయంలో చాలా ఫాస్ట్.. ఏ రాశుల వారు..ఎందుకు అలా ఉంటారు?

Zodiac Signs: ప్రేమ విషయంలో మనలో అందరికీ రకరకాల ఆలోచనలు.. భావాలూ ఉంటాయి. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది.

  • Publish Date - 10:21 pm, Mon, 21 June 21
ఈ నాలుగు రాశుల వారు బంధాల నుంచి విడిపోవడం విషయంలో చాలా ఫాస్ట్.. ఏ రాశుల వారు..ఎందుకు అలా ఉంటారు?
Zodiac Signs

Zodiac Signs: ప్రేమ విషయంలో మనలో అందరికీ రకరకాల ఆలోచనలు.. భావాలూ ఉంటాయి. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది. ప్రేమ గురించిన అభిప్రాయంలో సాధారణంగా ఏ ఇద్దరి ఆలోచనలూ కలవడం జరగదు. కొంత మంది ప్రేమలో శాశ్వతత్వం కోరుకుంటారు. కొందరు తను ప్రేమించినంతగా అవతలి వారూ తనను ప్రేమించాలని ఆరాట పడతారు. మరికొందరు ప్రేమ ఇవ్వడమే ఆనందం అని చెబుతారు. ఇంకొందరు ప్రేమిస్తారు కానీ.. చిన్న విషయానికే ఆ ప్రేమను అకస్మాత్తుగా వదిలేస్తారు. దానికి పెద్ద కారణమూ ఉండక్కర్లేదు. పెద్దగా అవతలి వారితో గొడవా అవసరం లేదు. వారికి నచ్చలేదు అంటే అంతే..అంతకు ముందు క్షణం వరకూ అవతలి వారిపై కొండంత ప్రేమ కురిపించిన ఆ వ్యక్తీ ఒకేసారి పక్కకు జరిగిపోతుంటారు. జాతక రీత్యా దీనిని పరిశీలిస్తే కొన్ని రాశుల వారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందని జాతక నిపుణులు చెబుతారు. ఆ రాశుల వారిలో స్వతహాగానే అటువంటి పధ్ధతి ఉంటుంది అంటున్నారు. మరి ఏ రాశుల వారు అలా అకస్మాత్తుగా తన ప్రేమకు గుడ్ బై చెప్పేసే అవకాశం ఉందని నిపుణులు చెప్పారో పరిశీలిద్దాం.

మిథునం..

మిథున రాశివారు సాధారణంగా అనిశ్చిత వ్యక్తులుగా ఉంటారు. వీరి దృష్టి చాలా తొందరగా మారిపోతుంది. ఏ విషయమైనా వీరికి నచ్చాలంటే చాలా సమయం పడుతుంది. అదేవిధంగా ప్రేమ కూడా. వీరిలో ప్రేమ పుట్టదమూ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ప్రేమ పుట్టాకా అవతలి వారితో అనుబంధాన్ని వేగంగా విస్తరిస్తారు. కానీ, చాలా త్వరగా ఆ ప్రేమ బంధం నుంచి బయట పడిపోగలుగుతారు. అవతలి వ్యక్తీ వద్ద చిన్న ఇబ్బంది వచ్చినా.. మంచి అనిపించకపోయినా వీరు తట్టుకోలేరు వెంటనే తమ ప్రేమ నుంచి బయటకు వచ్చేస్తారు.

కుంభం

కుంభ రాశి వారు భావాలను వ్యక్తీకరించడంలో అంతర్ముఖులై ఉంటారు. ముఖ్యంగా తమ ఇష్టాన్ని వ్యక్త పరచడంలో అస్సలు బయటపడరు. చాలా ఆలస్యంగా ఇటువంటి విషయాల్లో బయటపడతారు. కానీ, వీరు తమకు నచ్చని వారి దగ్గర నుంచి దూరంగా జరగడంలో మాత్రం అసలు ఆలస్యం చేయరు. నచ్చిన విషయాన్ని అవతలి వారికి చెప్పడానికి ఎంత ఆలస్యం చేస్తారో నచ్చకపోతే తెగతెంపులు చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ వేగంగా నిర్ణయం తీసుకుంటారు.

మేషం

మేష రాశి వారు చాలా వేగంగా ప్రేమలో పడిపోతారు. తేడా వస్తే అంతే వేగంగా ఆ బంధం నుంచి బయట పడిపోతారు. అస్సలు ఏ విషయంలోనూ సమయం వృధా చేయడం ఈ రాశివారికి అసలు ఇష్టం ఉండదు. అది ప్రేమలో పడటం అయినా.. విడిపోవడం అయినా అంతే త్వరగా జరిగిపోతాయి. ఆ కారణంగానే ఎన్నో విలువైన బంధాలను వీరు తరుచుగా కోల్పోతుంటారు.

ధనుస్సు

వీరు ఏ పని చేసినా నిజాయతీగా చేస్తారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా నిజాయతీగా ఉంటారు. అలానే అవతలి వారూ ఉండాలని కోరుకుంటారు. కానీ, ఏమాత్రం తేడా వచ్చినా తమలా అవతలి వారు ఉండట్లేదు అని ఏ క్షణం భావించినా వారితో తెగతెంపులు చేసుకోవడానికి వెనుకాడరు. తనెలా అవతలి వారితో ఉన్నానో వారూ తనతో అలానే ఉండాలనే ఆలోచన వీరిది. దానికి భంగం కలిగితే అసలు సహించలేరు.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు మహా మొండివారు..వారితో వాదన కష్టం..ఏ రాశుల వారంటే..

Zodiac Signs: అబద్ధాలు అందంగా చెప్పడం..ఆపద్ధర్మంగా అబద్ధం ఆడటం ఇది మీ జన్మరాశిని బట్టి ఎలా ఉంటుందో తెలుసుకోండి

Click on your DTH Provider to Add TV9 Telugu