Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు మహా మొండివారు..వారితో వాదన కష్టం..ఏ రాశుల వారంటే..

Zodiac Signs: కొంతమంది తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటారు. మీరు ఎంతగా చెప్పండి వాళ్లకు అసలు అర్ధం కాదు. సరికదా.. నేను చెప్పిందే తప్పన్తావా అంటూ వాదనకు దిగుతారు. వాళ్ళతో వాదనలో గెలవాలని ప్రయత్నిస్తే మన పని అయిపోయినట్లే.

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు మహా మొండివారు..వారితో వాదన కష్టం..ఏ రాశుల వారంటే..
Zodiac Signs
Follow us
KVD Varma

|

Updated on: Jun 12, 2021 | 8:52 PM

Zodiac Signs: కొంతమంది తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటారు. మీరు ఎంతగా చెప్పండి వాళ్లకు అసలు అర్ధం కాదు. సరికదా.. నేను చెప్పిందే తప్పన్తావా అంటూ వాదనకు దిగుతారు. వాళ్ళతో వాదనలో గెలవాలని ప్రయత్నిస్తే మన పని అయిపోయినట్లే. వీరిలో కొందరు ఎంత మొండిగా ఉంటారు అంటే వారు మాట్లాడే మాటలకు లాజిక్ ఉండదు. కనీస ప్రామాణికతా ఉండకపోవచ్చు. అయినా సరే తాము చెప్పిందే కరెక్ట్ అంటూ వారు మొండిగా వ్యవహరిస్తారు. జాతక రీత్యా కొన్ని రాశుల వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాశి చక్రాలను బట్టి ఈ మొండితనం ఎంత అనేది ఉంటుందని జాతక పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశుల వారు ఎక్కువ మొండితనం ప్రదర్శిస్తారు? అనేది తెలిస్తే మనకూ కాస్త మనశ్శాంతి ఉంటుంది. ఆ రాశుల వారితో వ్యవహరించే సమయంలో జాగ్రత్తగా ఉండొచ్చు. మరి అదేమిటో చూద్దాం..

మేషం

ఎక్కడా వెనక్కి తగ్గని లక్షణం మేషరాశి వారిది. తాము పట్టిందే పట్టు. ఇది ఒక బలమైన వాదన మీద నిలబడే రాశి చక్రం. ఈ రాశివారు విషయం తమదారికి వచ్చేవరకూ అంతే మొండిగా వ్యవహరిస్తారు. ఒకవేళ తాము అనుకున్నట్టు పరిస్థితి తమ దారిలోకి రాకపోతే తీవ్రంగా ఆగ్రహం చెందుతారు.

వృషభం

రాశిచక్ర సంకేతాలలో అత్యంత మొండి పట్టుదలగల రాశి వృషభం. నా దారి రహదారి.. బెటర్ నాకు అడ్డురావద్దు అనే శైలి వీరిది. వీరేం చేసినా అదే కరెక్ట్ అని నమ్ముతారు. అదే విషయానికి కట్టుబడిపోతారు. ఎదుటివారు తమతో ఏకీభవించకపోతే కచ్చితంగా కోపం వచ్చేస్తుంది. వారితో వాదనలో గెలవలేకపోతున్నాము అనిపిస్తే, ఇక ఆ కోపానికి అడ్డు ఉండదు. దీంతో ఎక్కువ ఆందోళన చెందుతారు.

ధనుస్సు

వీరు మొండిగా ఉంటారు. కానీ, ఇది కొంచెం వెరైటీ. ఎదుటి వారు మాట్లాడుకుంటున్న విషయాలు తమకు నచ్చినంత వరకూ వీరు ఎందులోనూ కలుగ చేసుకోరు. మనకి అప్పటి వరకూ వారితో చాలా సౌకర్యంగానూ ఉంటుంది. కానీ, అక్కడ ఏదైనా విషయంలో ధనుస్సు రాశివారు ఏకీభవించలేని పరిస్థితి వస్తే కనుక అప్పుడు సీన్ మారిపోతుంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. చాలా కోపం ప్రదర్శిస్తారు. తమ వాదనే కరక్ట్ అని పదే పదే చెబుతారు. అందరూ అదే నమ్మలనీ కోరుకుంటారు. కానీ ఏదైనా ఓ సందర్భంలో వీరు మెత్తబడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వీరు మౌనంగా ఉండిపోతారు.

సింహం 

లియో రాశి వారు మరోరకం. వీరు వాదిస్తారు. గెలవాలనీ కోరుకోరు. ఓడిపోవాలని అంతకంటే అనుకోరు. పోరాటం చేయాలని భావించరు. అయితే, వీరికి ఏదైనా విషయంలో వద్దు అని చెబితే మాత్రం వీరికి ఆ విషయంలో ఎక్కువ పట్టుదల వచ్చేస్తుంది. తాను చెప్పేది కరెక్ట్ అని నిరూపించడం కోసం విపరీతంగా కష్టపడతారు. దానిని ఒక సవాలుగా భావిస్తారు.ఈ రాశివారు ఎప్పుడూ టాప్ లోనే ఉండాలని అన్తుకుంటారు. ముఖ్యంగా వాదనల్లో. అలా అని ఎదుతవరిపై కోపం తెచ్చుకోవడం..పోట్లాడటం ఉండదు.

గమనిక- ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వీటిని అందిస్తున్నాము.

Also Read: Zodiac Signs: అబద్ధాలు అందంగా చెప్పడం..ఆపద్ధర్మంగా అబద్ధం ఆడటం ఇది మీ జన్మరాశిని బట్టి ఎలా ఉంటుందో తెలుసుకోండి

Zodiac Signs: ఈ రాశుల వారు ఉదయాన్నే లేవడానికి ఇష్టపడతారు..వేకువజామునే నిద్ర లేచి తమ రోజును ఉల్లాసంగా ఉంచుకుంటారు