AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశుల వారు ఉదయాన్నే లేవడానికి ఇష్టపడతారు..వేకువజామునే నిద్ర లేచి తమ రోజును ఉల్లాసంగా ఉంచుకుంటారు

Zodiac Signs: వేకువజామునే లేవడం ఒక మంచి అలవాటు. ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తుల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతారు. అదీకాక ఉదయాన్నే మేల్కొనేవారికి రోజంతా సానుకూలంగా ఉంటుందట.

Zodiac Signs: ఈ రాశుల వారు ఉదయాన్నే లేవడానికి ఇష్టపడతారు..వేకువజామునే నిద్ర లేచి తమ రోజును ఉల్లాసంగా ఉంచుకుంటారు
Zodiac Signs
KVD Varma
|

Updated on: Jun 09, 2021 | 7:23 PM

Share

Zodiac Signs: వేకువజామునే లేవడం ఒక మంచి అలవాటు. ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తుల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతారు. అదీకాక ఉదయాన్నే మేల్కొనేవారికి రోజంతా సానుకూలంగా ఉంటుందట. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఉదయాన్నే నిద్ర లేవదానికీ.. రాశి చక్రానికి సంబంధం ఉంటుందని చెబుతారు. కొన్ని రాశులలో పుట్టినవారికి స్వతహాగానే ఉదయాన్నే లేవడం అనే అలవాటు వచ్చేస్తుందట. వారి పనులను బట్టి సాధారణంగా ఉదయాన్నే నిద్రలేచి తమ నిత్యకృత్యాలను పూర్తి చేసుకోవడానికే ఆ రాశుల ప్రజలు ఇష్టపడతారని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఏ రాశుల వారు ఉదయాన్నే లేవడానికి ఇష్టపడతారో జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పినదాని ప్రకారం ఒకసారి పరిశీలిద్దాం.

కుంభం

కుంభరాశి వారు చాలా నిశ్శబ్దంగా ఉండే ఆహ్లాదకరమైన సమయంలో.. ఉదయాన్నే మేల్కొనడానికి ఇష్టపడతారు. వారు ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడటానికి ఇష్టపడతారు. వారు త్వరగా లేచి వారి పనిని పూర్తి చేసుకోవాలని భావిస్తారు. ముందుగానే మేల్కొనడం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఈ రాశివారు ఎక్కువగా నమ్ముతారు.

సింహం

సూర్యుడిని తన రాశిచక్ర చిహ్నంగా కలిగి ఉన్న లియో రాశి వారు.. ప్రతిరోజూ ఒక కొత్త ఆరంభంగా చూస్తారు. ప్రతి విషయం, క్రొత్త విషయంలా భావిస్తారు. చాలా సానుకూల వైఖరి ఉన్న వ్యక్తులుగా ఉంటారు. వారు త్వరగా లేచి సానుకూల ఆలోచనలను పొందడానికి పనిచేయాలని కోరుకుంటారు.

కన్య

ఈ రాశి వారు అనేక ఆచారాలను అనుసరించేవారిగా ఉంటారు. సహజంగానే ఆచారవ్యవహారాలను పాతిన్చాలనుకునే వారు ఉదయాన్నే లేవదానికే ఇష్టపడతారు. వారు ఉదయాన్నే లేచి, తమ కోసం తాము నియమ నిబంధనల ప్రకారం తమ విధులు నిర్వర్తించుకోవాడానికి ప్రయత్నిస్తారు.

తుల

తుల ప్రజలు తమ జీవితంలో చాలా విషయాలు కోల్పోతారని లేదా పొందలేరని ఎప్పుడూ భయపడతారు. తమకు ఇష్టమైన వాటిలో ఏదీ లభించకపోతే వారు త్వరగా లేచి తమ పనిని ప్రారంభించడం ద్వారా దానిని సాధించాలని భావిస్తారు. వీరు ఉదయాన్నే లేవాలని నిర్ణయించుకుంటే వీరికి గడియారంలో అలారం అవసరం లేదు. సరిగ్గా వారు లేవాలనుకునే సమయానికి లేచి వారి పనులు పూర్తి చేసుకుంటారు.

ధనుస్సు

ధనుస్సువాసులు కాస్త సోమరితనం కలిగి ఉంటారు. కానీ, వారు ఉదయాన్నే మేల్కొలపడానికి ఇష్టపడతారు. ఇది వారి శరీరం మరియు మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి, వారి వృత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని వారు నమ్ముతారు. అదే సమయంలో వారు అందుబాటులో ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు మరియు జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఈ విషయాలు వివరించడం జరిగింది.

Also Read: Horoscope Today: ఈరాశుల వారికి ఈరోజు ఉద్యోగాల విషయంలో మంచి జరుగుతుంది… రాశి ఫలాలు..

Zodiac Signs: ఈ రాశుల వారికి ఏదైనా రహస్యం చెప్పారో..ఇక అంతే! ఆకాశవాణి కంటె వేగంగా బయటకు వెళ్ళిపోతుంది