AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశుల వారికి ఏదైనా రహస్యం చెప్పారో..ఇక అంతే! ఆకాశవాణి కంటె వేగంగా బయటకు వెళ్ళిపోతుంది

Zodiac Signs: కొంతమందికి ఏదన్నా విషయం గురించి తెలిసింది అంటే చాలు.. ఇక అది ఎవరికో ఒకరికి చెప్పేవరకూ మనశ్శాంతి ఉండదు. అటువంటి వారు తమ మనసులో ఏదీ దాచుకోరు.

Zodiac Signs: ఈ రాశుల వారికి ఏదైనా రహస్యం చెప్పారో..ఇక అంతే! ఆకాశవాణి కంటె వేగంగా బయటకు వెళ్ళిపోతుంది
Zodiac Signs
KVD Varma
|

Updated on: Jun 05, 2021 | 7:22 PM

Share

Zodiac Signs: కొంతమందికి ఏదన్నా విషయం గురించి తెలిసింది అంటే చాలు.. ఇక అది ఎవరికో ఒకరికి చెప్పేవరకూ మనశ్శాంతి ఉండదు. అటువంటి వారు తమ మనసులో ఏదీ దాచుకోరు. తమకు ఎవరి వద్దనుంచి అయినా విషయం తెలిసిన వెంటనే దానిలో మంచి చెడులు వారు ఆలోచించలేరు. తమకు తెలిసింది.. వెంటనే వేరొకరికి చెప్పాలి. అంతే వారి ధోరణి. ఒకవేళ ఎవరైనా స్నేహితుడు చాలా రహస్యం అంటూ ఏదైనా విషయాన్ని ఇలాంటి వారికి చెబితే ఒకరోజు రెండు రోజులు కంటె ఎక్కువ ఆ విషయాన్ని తమలో దాచుకోలేరు. కచ్చితంగా బయటకు చెప్పేస్తారు. వారు చేసే ఈ పని వలన ఎంత నష్టం జరుగుతుంది అని ఆలోచించరు.

అయితే, ఇది వారి తప్పు కాదు అంటుంది జ్యోతిష శాస్త్రం. కొన్ని రాశుల వారి తీరే అలా ఉంటుంది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతారు. వారికి పుట్టుకతోనే ఆ లక్షణం అబ్బుతుందని అంటారు. అందుకే ఆ రాశుల వారితో రహస్యాలను పంచుకోకుండా జాగ్రత్త పడాలి అని సూచిస్తున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏ రాశివారు తమ మనసులో రహస్యాలు దాచుకోలేరో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషం: మేషరాశి 12 రాశిచక్రాలలో మొదటిది. దీనికి అంగారకుడు రాజు. ఈరాశి వారు సాధారణంగా కల్మషం లేనివారిగా ఉంటారు. వీరి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరితోనైనా ఎటువంటి సంబంధాన్ని అయినా సరే, హృదయపూర్వకంగా తీసుకుంటారు. అయితే, వారిలో ఓ చెడ్డ అలవాటు ఉంటుంది. వారు ఏ విషయాన్నీ తమ మనసులో ఉంచుకోలేరు. ఎవరికో ఒకరికి చెప్పకపోతే వారికి నిద్ర పట్టదు.

మిథునం: ఈ రాశిచక్రం యజమాని బుధుడు. మిథున రాశివారు తమ సంబంధ బాంధవ్యాల్లో చాలా నిజాయతీగా ఉంటారు. కానీ, వీరికి గాసిప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి విషయానికీ చిలువాలూ వలువాలూ చేర్చి ప్రచారం చేయకపోతే వీరికి మనశ్శాంతి ఉండదు. ఒకసారి వీరి దృష్టిలోకి ఏదైనా విషయం వెళ్ళిందా..ఇక అది ప్రపంచానికి ఎలా ఏ రూపంలో తెలుస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. అందుకే ఈ రాశి వ్యక్తులకు ఏదైనా చెప్పేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని చెబుతారు.

తుల: తుల రాశిచక్రానికి ప్రభువు శుక్రుడు. తుల రాశిచక్రం ఉన్నవారికి చెడు ఉద్దేశాలు ఏమాత్రం ఉండవు. కాకపొతే వీరికి ఉత్సాహం.. కోపం రెండూ ఎక్కువే. అందుకే ఏదైనా విషయం వారికీ తెలిస్తే దానిని ఉత్సాహంగా అందరితో పంచుకుంటారు. అదేవిధంగా ఏదైనా సీక్రెట్ అని ఎవరైనా చెప్పిన విషయాన్ని కొంతకాలం దాచి పెడతారు. కానీ, ఈ సమయంలో ఆ విషయం చెప్పిన వారిపై కోపం వచ్చిందీ అంటే.. ఇక ఆ రహస్యం బట్టబయలు చేసేస్తారు.

కర్కాటకం: ఈ రాశిచక్రానికి రాజు చంద్రుడు. వీరి మనసు చాలా అస్థిరంగా ఉంటుంది. వీరు ఏదైనా విషయం విన్న వెంటనే పరధ్యానంలో పడతారు. ఒకవేళ ఏదైనా గొప్ప రహస్యం వింటే కనుక ఆ విషయాన్ని దగ్గర వారితో పంచుకునే వరకూ వారి మనసులో భయం వెంటాడుతుంది. అందువల్ల ఈ రాశివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు మరియు జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఈ విషయాలు వివరించడం జరిగింది)

Also Read: Horoscope Today: ఆ రాశుల వారంతా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. శనివారం రాశి ఫలాలు ..

Zodiac Signs: మీరు విజయవంతం కావడానికీ మీ రాశికి సంబంధం ఉంటుంది..ఎలానో తెలుసుకోండి..