AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారు విలువైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.. ఆదివారం రాశిఫలాలు ..

Today Horoscope : ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారు విలువైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.. ఆదివారం రాశిఫలాలు ..
Horoscope Today
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2021 | 7:20 AM

Share

Rasi Phalalu Today: కొన్నిసార్లు మనకు అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే ఎప్పుడూ చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం..

మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు వృత్తి, వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆంజనేయస్వామి ఉపాసన చేసుకోవడం మంచిది.

వృషభరాశి: ఈ రాశి విద్యార్థులకు కొన్ని లక్ష్యాలు పెరుగుతుంటాయి. భవిష్యత్తు గురించి కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. పేదవారికి వస్త్రదానం చేసుకోవడం శుభప్రదం.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు వేరు వేరు రూపాల్లో పరిస్థితులు అనుకూలించడం కోసం ఎదురు చూస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ధన్వంతరిస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వేర్వేరు రూపాల్లో ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దుర్గా అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది. .

కన్యా రాశి : ఈ రాశి చేపట్టినటువంటి పనులను సావధానంగా పూర్తిచేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్ష్మీనారసింహాస్వామి వారి స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి షేర్లు, పెట్టుబడుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. పెద్దవారి సలహాలు, సూచనలు మేలు చేస్తుంటాయి. అష్టలక్ష్మీస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. నందీశ్వరుని దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు కుటుంబపరమైనటువంటి శుభకార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నవగ్రహస్తోత్ర పారాయణం మేలు చేస్తుంటుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులను, బంధువులను కలుసుకుంటుంటారు. చిన్నచిన్న విందు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. పేదవారికి ఆహార పదార్థాలు దానం చేసుకోవడం మంచిది.

మీన రాశి: ఈ రాశికి వ్యవహారిక విషయాలు కొంత ఆలస్యమవుతుంటాయి. చేపట్టినటువంటి పనుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సూర్యగ్రహ అర్చన మేలు చేస్తుంది.