AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HOROSCOPE TODAY : ఆ రాశివారికి ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి.. ఖరీదైన వస్తువులు కొనుగోలు..

RASI PHALALU- 2021 ON JUNE 07 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.

HOROSCOPE TODAY : ఆ రాశివారికి ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి.. ఖరీదైన వస్తువులు కొనుగోలు..
Horoscope Today
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 07, 2021 | 6:18 AM

Share

RASI PHALALU- 2021 ON JUNE 07 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు సోమవారం (జూన్ 07న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి : ఆఫీసు పనిలో తోటి ఉద్యోగులు సహాయం చేస్తారు. పని మీద ధ్యాస వుంచండి అన్ని పనులు పూర్తవుతాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సరైన పెట్టుబడులలో డబ్బు పెట్టండి లాభాలు వస్తాయి. వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం.

వృషభ రాశి : ధన లాభం ఉంది. కొంత మంది స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. వివాదాస్పద విషయాల జోలికి వెళ్లి వాదోపవాదాలు చేయకండి. వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు.

మిధున రాశి : నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. సహనమే మీ విజయానికి సూచిక. కొంతమంది జీవితాల్లోకి చిన్ని పాప/ బాబు రాబోతున్నారు. వారికి పేర్లను వెతుక్కోండి. ముఖ్యమైన విషయాల్లో తండ్రిగారి సలహా తీసుకోండి. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మార్పు కై ప్రయత్నాలు చేసే వాళ్లు త్వరపడండి. జీతంలో పెరుగుదల. ప్రేమికులు త్వరలో వివాహంతో ఒకటయ్యే అవకాశం.

కర్కాటక రాశి : ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. భయాందోళనలను వదిలివేయండి సహనంగా ఆలోచించండి. యోగా మెడిటేషన్ చేయండి. వ్యాపార విస్తరణకు పాత లావాదేవీలు అడ్డంకిగా మారుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయుల సహాయం తీసుకోండి. మీ పిల్లలు చదువు మీద కన్నా వేరే విషయాల మీద శ్రద్ధ పెడుతున్నారు గమనించండి.

సింహ రాశి : ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రమ వలన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. మెడ నొప్పి కి అవకాశం. యోగా ఒక ఉపాయం. మీ బంధువులు మీ దగ్గర నుంచి ఏదో భారీగా ఆశిస్తున్నారు. జాగ్రత్త. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి అనవసరపు విషయాల జోలికి వెళ్ళకండి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు రావలసిన ధనం చేతికందుతుంది.

కన్యారాశి : మీ తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా గడపండి. వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని అనుకోని విషయాలు మిమ్మల్ని విచారానికి గురిచేస్తాయి. తొందరపాటు వద్దు ప్రతి విషయాన్ని సహనంతో చెయ్యండి. ఆదాయ వ్యవహారాలు బాగున్నా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారం లో నూతన పెట్టుబడులకు మంచి అవకాశం.

తులారాశి : వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కానీ బయట భోజనం వద్దు. ఆఫీసులో తోటి ఉద్యోగుల మీద ఆధారపడటం వలన అన్ని పనులూ ఆలస్యం. కొంతమందికి ఆఫీస్ టూర్స్ ఉండవచ్చు. ఈ కరోనా సమయంలో అనవసర భయాందోళనలను వదిలివేయండి.

వృశ్చిక రాశి : వివాహం కాని వారికి కోరుకున్న సంబంధం కుదిరి అవకాశం. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. ఇతరులతో కులాసాగా గడపటం మీ సమయం వృధా మరియు పనులన్నీ పెండింగ్ పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆరోగ్య సమస్యలు లేవు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. నూతన వస్త్రములు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి : ఆఫీసు పనులను సరైన ప్రణాళికతో పూర్తిచేయండి. నిర్లక్ష్యం వలన తప్పులు జరిగే అవకాశం. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకున్నా ఫిట్ నెస్ కొరకు యోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. నిరాశ వాద వ్యక్తులను దూరం పెట్టండి. ఎదురుచూస్తున్న రుణాలు చేతికి అందుతాయి. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. వివాహేతర సంబంధాల వలన ఇబ్బందులు.

మకర రాశి : అనవసర విషయాలపై భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు రావచ్చు. యోగ మెడిటేషన్ వలన శారీరక మానసిక ఆరోగ్యం. ప్రతి పనికి ఒక సరైన ప్రణాళిక తప్పనిసరి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక విషయాలు మరింత మెరుగు పడతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. గందరగోళం వదిలేయండి. చదువుపై శ్రద్ధ లేకపోతే విద్యార్థులకు వైఫల్యం.

కుంభ రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. కొంతమందికి ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. యోగ మెడిటేషన్ వలన శారీరక మానసిక ఆరోగ్యం. బంధువులను మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ కరోనా సమయంలో ఆఫీసులో తోటి ఉద్యోగులతో అన్ని జాగ్రత్తలూ తీసుకోండి. ఆర్థిక విషయాలు ఎంతో మెరుగు పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

మీన రాశి : మీ ఆరోగ్యం గురించి మీరే ఆలోచించుకోవాలి. యోగా మెడిటేషన్ వలన మానసిక శారీరక ఆరోగ్యం. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ ఇంటి లోకి చిన్ని బాబు /పాప రాబోతున్నారు వారికి పేర్లు వెతకండి. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. వ్యాపారం లో నూతన పెట్టుబడులపై అన్ని జాగ్రత్తలు తీసుకోండి.