AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరాశుల వారికి ఈరోజు ఉద్యోగాల విషయంలో మంచి జరుగుతుంది… రాశి ఫలాలు..

Horoscope Today On June 9th 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

Horoscope Today: ఈరాశుల వారికి ఈరోజు ఉద్యోగాల విషయంలో మంచి జరుగుతుంది... రాశి ఫలాలు..
Horoschope Today
Rajitha Chanti
|

Updated on: Jun 09, 2021 | 7:09 AM

Share

Horoscope Today On June 9th 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. రోజు తమ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 9న) బుధవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి.. ఈరోజు వీరు విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత సహకారం లభిస్తుంది. పార్వతి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

వృషభ రాశి.. ఈరోజు వీరు తమకున్న నిలువ ధనాన్ని, ఆస్తులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్దవారి ఆశీస్సులు పొందడం మంచిది.

మిధున రాశి.. ఈరోజు వీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. శ్రమకు ఒర్చి శుభ ఫలితాలను పొందుతారు. పార్వతి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పణ చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు ఇతరులపైన ఆధారపడకుండా.. స్వయం శక్తితో అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తుంటారు. గణపతి నామార్చన మేలు చేస్తుంది.

సింహ రాశి.. ఈరోజు వీరు సాత్విక ఉపాసన పైన విశేషమైన దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరాలు ఉన్నాయి. దురాశలకు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శివాలయ దర్శనం మేలు చేస్తుంది.

కన్య రాశి.. ఈరోజు వీరు సాంఘిక, జన సంక్షేమమైన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సాయంకాలాల్లో దుర్గ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

తులా రాశి.. ఈరోజు వీరికి విద్యా, ఉద్యోగాది విషయంలో వ్యాపారపరంగా కొన్ని శుభఫలితాలను పొందుతారు. అనారోగ్య సంబంధమైన భావనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సూర్యగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరు విశేషమైన లాభాలు పొందేందుకు తగినటువంటి సమయం కోసం ఎదురుచూస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. 11 సార్లు హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు భాగస్వాములతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనుకోని విషయాలు కూడా తెలుస్తుంటాయి. మహా మృత్యుంజయ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి.. ఈరోజు వీరు శత్రువులపైన ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. రుణసంబంధమైన ఆలోచనలు బలపడుతుంటాయి. అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి.. ఈరోజు వీరు సంతాన సంబంధమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లల చదువులపై శ్రద్ధ తీసుకోవాలి. మహా సరస్వతి అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.

మీనరాశి.. ఈరోజు వీరు ఇంటికి సంబంధించిన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. నవగ్రహా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

Also Read: Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమాలో భాగం కానున్న ఎన్టీఆర్.. ‘బింబిసార’ కోసం యంగ్ టైగర్ వాయిస్ ?

Telangana Employees PRC: ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపు.. ఈ నెల నుంచే అమలు.. 30 శాతం ఫిట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం