Telangana Employees PRC: ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపు.. ఈ నెల నుంచే అమలు.. 30 శాతం ఫిట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. పెరిగిన వేతనం జూలై నెలలో చేతికి అందనుంది.
Telangana Govt.Employees PRC Wages: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. పెరిగిన వేతనం జూలై నెలలో చేతికి అందనున్నది. వీరితో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ కలిపి మొత్తం 9,21,037 మందికి 30 శాతం ఫిట్‌మెంట్ (వేతనాల పెంపు) ఇవ్వాలని గత మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెంచిన వేతనాన్ని జూన్ నెల నుంచి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్‌ను 2018 జూలై 1 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 2020 ఏఫ్రిల్ 1 నుంచి, క్యాష్ బెనిఫిట్‌ను 2021 ఏఫ్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు అనుమతించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. పింఛనుదారులకు 1 4 2020 నుంచి 31 5 2021 వరకు చెల్లించాల్సిన బకాయి(ఎరియర్స్)లను 36 వాయిదాల్లో చెల్లించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగినులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇంటి అద్దెభత్యం (హెచ్‌ఆర్‌ఏ) మీద పరిమితిని తొలగించేందుకు అనుమతించింది.
గత ఏడు దశాబ్దాల్లో ఏ పీఆర్సీ కూడా పట్టించుకోని దాదాపు ఆరు లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం దేశంలో ఇదే మొదటిసారి. ఉద్యోగులందరికీ పూర్తి, సమగ్ర పీఆర్సీని ప్రకటించడమూ ఇదే తొలిసారి. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశం ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం తెలిపింది. పెంచిన వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు రూ.12,595 కోట్ల వరకు లబ్ధి చేకూరనున్నది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కింద పనిచేస్తున్న ఉద్యోగి రిటైర్ కావడానికి ముందు చనిపోతే.. పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకొన్నారు. సీపీసీ ఉద్యోగి రిటైర్మెంట్‌కు ముందే చనిపోతే.. అతని భాగస్వామ్యం తక్కువగా ఉంటుంది. దీంతో ఆ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్రవేసింది. అదేవిధంగా ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Read Also… Google Meet: గూగుల్ మీట్‌లో మరో అద్భుత ఫీచర్.. యూజర్ ఇక నుంచి తమకు నచ్చిన..