UPI Money Transfer: పొరపాటున మీ డబ్బును ఇతరుల అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారా?.. ఇలా తిరిగి పొందండి..!

UPI Money Transfer: తొందరలోనో.. ఏమరపాటు గానో.. మనం ఒక్కొక్కసారి ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

UPI Money Transfer: పొరపాటున మీ డబ్బును ఇతరుల అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారా?.. ఇలా తిరిగి పొందండి..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 09, 2021 | 4:57 AM

UPI Money Transfer: తొందరలోనో.. ఏమరపాటు గానో.. మనం ఒక్కొక్కసారి ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఫలితంగా ఆ డబ్బును మళ్లీ రిటర్న్ తెప్పించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అసలు మనీ చాలా సార్లు కూడా మేము త్వరితంగా వేరొకరికి డబ్బు పంపుతాము మరియు మీ చిన్న పొరపాటు లేదా తొందరపాటు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు అనుకోకుండా మరొక ఖాతాకు డబ్బు పంపితే, ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందా?

ఆన్‌లైన్ బ్యాంకింగ్ యుగంలో, ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల ద్వారానే బ్యాంకింగ్ సర్వీసులను నిర్వహిస్తున్నారు. డబ్బు బదిలీ చేయడానికి బ్యాంక్‌లో లైన్‌లో నిలబడటానికి బదులుగా తమ చేతిలో సెల్‌ఫోన్ ద్వారానే క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ కొట్టేస్తున్నారు. దానికి కారణంగా యూపీఐ. ఈ యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల వ్యవధిలోనే నగదు బదిలీలు విజయవంతంగా జరిగిపోతున్నాయి. అయితే, ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. అవే ప్రజలకు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తొందరలోనో.. ఏమరపాటు గానో.. మనం ఒక్కొక్కసారి ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దాంతో వారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, అనుకోకుండా మరొక ఖాతాకు డబ్బు పంపితే ఆ డబ్బు తిరిగి వస్తుందా? ఆ డబ్బు తిరిగి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల, ఒక వ్యక్తి ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. అయితే, తాను ఎదుర్కొన్న ఇబ్బందిని తన స్నేహితులతో పంచుకోగా.. వారు అతనికి కొన్ని సూచనలు చేశారు. పొరపాటు ఇతరుల ఖాతాకు వెళ్లిన సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే ఏం చేయాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూపీఐ ట్విట్టర్‌లో వివరించాయి. యూపిఐ ట్వీట్.. ‘‘ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వివరాలు నమోదు చేస్తే పొరపాటున మీ డబ్బు వారికి బదిలి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లావాదేవీ చేయడానికి ముందు లబ్ధిదారుల పూర్తి వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ఏదైనా పొరపాటు జరిగితే.. తక్షణమే బ్యాంకును సంప్రదించాలి.’’ అని పేర్కొంది.

ఇదిలాఉంటే.. బ్యాంక్ ఆఫ్ బరోడా పొరపాటున జరిగే ట్రాన్సాక్షన్స్‌ విషయంలో ఏం చేయాలనేదానిపై ట్వీట్ చేసింది. ‘‘పొరపాటున ఇతరుల ఖాతాలకు డబ్బు బదిలీ అయితే.. బ్యాంకు బాధ్యత వహించదు. అయితే, డబ్బును ఒకసారి మాత్రమే రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది.’ అని పేర్కొంది.

ఎలా ఫిర్యాదు చేయాలి? నగదు బదిలీ చేసేటప్పుడు డబ్బు మరొక వ్యక్తి ఖాతాలోకి వెళ్లినట్లయితే.. ఆ డబ్బును రాబట్టుకోవడానికి వేరే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. మీరు డబ్బు పంపిన ఖాతా కూడా అదే బ్యాంకు కస్టమర్ అయినట్లయితే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు మేరకు బ్యాంక్ సిబ్బంది లబ్ధిదారుని సంప్రదించి, డబ్బును తిరిగి పంపమని రిక్వెస్ట్ పెడతారు. డబ్బు అందుకున్న వ్యక్తి అంగీకరిస్తే 7 పని దినాలలోపు డబ్బు మీ ఖాతాకు తిరిగి వస్తుంది. లబ్ధిదారుడు మరేదైనా శాఖకు చెందినవారైతే, మీరే ఆ శాఖకు వెళ్లి బ్యాంక్ మేనేజర్‌తో సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలి.

Also read:

Google Meet: గూగుల్‌ మీట్‌లో మరో అద్భుత ఫీచర్.. యూజర్ ఇక నుంచి తమకు నచ్చిన..

IND vs SRL: ఇంగ్లండ్ పర్యటనలో వారు బిజీ.. శ్రీలంక పర్యటన కోసం వీరు బిజీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Error 503: ఓ గంటపాటు ఇంటర్‌నెట్ డౌన్.. అంతరాయంకు చింతిస్తూ వెబ్ పేజ్‌లో 503… ఎందుకో తెలుసా..