Bumper Offer: శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 ప్లస్ కొనుగోలు చేయండి.. రూ. 10 వేలు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందండి..
Bumper Offer: శామ్సంగ్ తన కస్టమర్లకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ను కొనుగోలు చేసే కస్టమర్లకు..

Bumper Offer: శామ్సంగ్ తన కస్టమర్లకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ను కొనుగోలు చేసే కస్టమర్లకు ఇప్పుడు రూ .10,000 తక్షణ క్యాష్ బ్యాక్ ఇవ్వబడుతోంది. ఈ ఆఫర్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .71,999, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .75,999 లకు లభిస్తోంది. దీంతోపాటు.. గెలాక్సీ బడ్స్ ప్రో, గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 21 ప్లస్, గెలాక్సీ ఎస్ 21 కొనుగోలు చేసే వినియోగదారులకు రూ .990 నుంచి రూ .10,000 విలువైన సామ్‌సంగ్ షాప్ వోచర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
ఇవే కాకుండా, గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 21 కోసం రూ .10,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ రెండు మొబైల్స్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు.. సులభమైన ఇఎంఐ ఆప్షన్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, వరుసగా రూ .10,000, రూ .5 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగిందని కంపెనీ తెలిపింది. గెలాక్సీ ఎస్ 21 సిరీస్‌కు సంబంధించి అన్ని ఆఫర్‌లు ప్రస్తుతం శామ్‌సంగ్ షాప్ (శామ్‌సంగ్.కామ్ / ఇన్), శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు కొనసాగుతాయని కంపెనీ వెల్లడించింది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ మొబైల్స్ కొనుగోలుపై డబుల్ ధమాకా ఆఫర్లను కూడా విడుదల చేసింది. గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 21 ప్లస్, గెలాక్సీ ఎస్ 21 కొనుగోలు చేసే కస్టమర్లు రూ .15,990 విలువైన గెలాక్సీ బడ్స్ ప్రోను కేవలం రూ. 990 రూపాయలకు ఇస్తోంది. లేకపోతే.. రూ .10,000 విలువైన సామ్‌సంగ్ షాప్ వోచర్‌ను ఇవ్వడం జరుగుతుందని కంపెనీ ధృవీకరించింది. అయితే, కస్టమర్లు గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత గెలాక్సీ బడ్స్ ప్రోను క్లెయిమ్ చేయడానికి ఇలా చేయాలంటూ కొంత ప్రాసెస్‌ని ప్రకటించింది. ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు.. శామ్‌సంగ్ షాప్ క్లెయిమ్ వోచర్లలో నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా బడ్స్ ప్రోను 990 రూపాయలకు లభిస్తుందని తెలిపింది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ఫీచర్స్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్.. 6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 2400 × 1080 రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్‌తో కంపెనీ సొంత ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగిఉంది. అలాగే కంపెనీ సొంత వన్ యుఐ 3.1 స్కిన్ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కలిగిన ఈ ఫోన్.. 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ కలిగిఉంది. ఐపి68 తో దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫోన్ ముందు కెమెరా ద్వారా డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా ఉంది. దీనిలో 64 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు రెండు 12 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. ముందు వైపు, సెల్ఫీలు తీసుకోవడానికి 10 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
Also read:
Black Fungus: భయంతో చెట్లన్నీ నరికేస్తున్న ప్రజలు.. వారు చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..
UPI Money Transfer: పొరపాటున మీ డబ్బును ఇతరుల అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారా?.. ఇలా తిరిగి పొందండి..!




