Black Fungus: భయంతో చెట్లన్నీ నరికేస్తున్న ప్రజలు.. వారు చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..
Black Fungus: ఓ వైపు కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడిస్తుంటే.. మరోవైపు బ్లాక్‌ఫంగస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కేసులతో పాటే..
Black Fungus: ఓ వైపు కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడిస్తుంటే.. మరోవైపు బ్లాక్‌ఫంగస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కేసులతో పాటే.. బ్లాక్‌ఫంగస్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రజల్లో కరోనా భయంతో పాటు.. బ్లాక్ ఫంగస్ భయం కూడా పట్టుకుంది. ఇక బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే దీనిని అంటువ్యాధిగా ప్రకటించాయి. అయితే, బ్లాక్‌ఫంగస్ వ్యాప్తికి తేమనే కారణమని వైద్యులు చెప్పిన దరిమిలా.. మహారాష్ట్రలో ఓ ప్రాంత ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఫలితంగా తేమ ఉండకూడదనే ఉద్దేశంలో తమ పరిసరాలు సహా ఇతర ప్రాంతాల్లో చెట్లను నరికివేస్తున్నారు.
చుట్టూ చెట్ల ఉనికి తేమను పెంచుతుందని ప్రజలు నమ్ముతారు. దీనివల్ల బ్లాక్ ఫంగస్ వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ కారణంగానే తమ చుట్టూ ఉన్న చెట్లను జనాలు నరికేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. ప్రజల్లో ఉన్న భ్రమను తొలగించేందుకు ముందుకు వచ్చారు. బ్లాక్ ఫంగస్‌కు చెట్లకు ఏమాత్రం సంబంధం లేదని నాసిక్ అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ పంకజ్ గార్గ్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధికి చెట్టుతో సంబంధం లేదు.. బ్లాక్ ఫంగస్ వ్యాధి పెరగడానికి కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే కారణం అని డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్‌కు భయపడి ప్రజలు చెట్లను నరికివేయడం సరైన చర్య కాదన్నారు. ఈ వ్యాధికి చెట్టుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ వ్యాధి సోకడానికి కారణం తక్కువ రోగనిరోధక శక్తి, తరచుగా ఆవిరి తీసుకోవడం, స్టెరాయిడ్ల వాడకం అని ఆయన వివరించారు.
Also read:
UPI Money Transfer: పొరపాటున మీ డబ్బును ఇతరుల అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారా?.. ఇలా తిరిగి పొందండి..!
Google Meet: గూగుల్ మీట్‌లో మరో అద్భుత ఫీచర్.. యూజర్ ఇక నుంచి తమకు నచ్చిన..