AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SRL: ఇంగ్లండ్ పర్యటనలో వారు బిజీ.. శ్రీలంక పర్యటన కోసం వీరు బిజీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

IND vs SRL: ఈ ఏడాది జూలైలో టీమిండియా ఒకేసారి రెండు దేశాల్లో ఆడనుంది. వాటిలో ఒకటి ఇంగ్లాండ్, రెండోది శ్రీలంక. భారత జట్టు ఇప్పటికే...

IND vs SRL: ఇంగ్లండ్ పర్యటనలో వారు బిజీ.. శ్రీలంక పర్యటన కోసం వీరు బిజీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Cricketers
Shiva Prajapati
|

Updated on: Jun 09, 2021 | 4:47 AM

Share

IND vs SRL: ఈ ఏడాది జూలైలో టీమిండియా ఒకేసారి రెండు దేశాల్లో ఆడనుంది. వాటిలో ఒకటి ఇంగ్లాండ్, రెండోది శ్రీలంక. భారత జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్.. జూన్ 18న జరుగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇదే సమయంలో శ్రీలంకతోనూ టీమిండియా పోరుకు సిద్ధమైంది. జులై నెలలో శ్రీలంక జట్టుతో టీమిండియా పోరానుంది. అయితే, శ్రీలంక టూర్‌కు జట్టును ఇంకా బిసిసిఐ ప్రకటించలేదు. ఈ నెల చివరికి జట్టును ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంగ్లండ్ టూర్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఇద్దరు భారతీయ ఆటగాళ్ళు శ్రీలంక టూర్‌లో తమ సత్తా ఏంటో చూపించేందుకు కసరత్తులు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. ఆ ఇద్దరే శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా. వీరిద్దరూ కలిసి ప్రాక్టీస్‌లో బిజీగా గడిపేస్తున్నారు.

శ్రేయాస్ అయ్యర్ ఫిట్నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లయితే.. అతను, పృథ్వీ షా ఇద్దరూ శ్రీలంకకు వెళ్లడం దాదాపు ఖాయం. శ్రీలంకతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌లో వారిద్దరూ ఆడతారు. అయితే, తమ బెర్త్‌పై పూర్తిగా ధీమాతో ఉన్న ముంబై క్రికెటర్లు.. శ్రీలంక పర్యటన కోసం సంయుక్తంగా కసరత్తులు చేస్తున్నారు. వారి ప్రాక్టీస్‌కు సంబంధించి వీడియోలను ఇన్‌స్టాగ్రమ్‌లో తమ అభిమానులతో పంచుకున్నారు. పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేయగా, శ్రేయాస్ అయ్యర్ రన్నింగ్ సెషన్‌కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు.

ఉవ్విళ్లూరుతున్న శ్రేయాస్.. శ్రేయస్ అయ్యర్ వైట్ బాల్ క్రికెట్‌లో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌లో నమ్మకమైన బ్యాట్స్‌మన్. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయాస్‌ భుజానికి గాయం అయ్యింది. దాంతో ఏప్రిల్‌లో ఆ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ 2021 తొలి 29 మ్యాచ్‌ల్లో కూడా అతను పాల్గొనలేకపోవడానికి కారణం ఇదే. అయితే, ఇప్పుడు శ్రేయాస్ గాయం నుండి కోలుకున్నాడు. నిరంతరం శిక్షణను కొనసాగిస్తున్నారు. శ్రీలంక పర్యటనకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

పృథ్వీ షా‌ది చివరి మ్యాచ్ అదే.. మరోవైపు పృథ్వీ షా, ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణించి టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబయి నాలుగో విజయ్ హజారే టైటిల్‌ను గెలుచుకోవడానికి అతను చేసిన 827 పరుగులే కారణమని చెప్పొచ్చు. ఐపీఎల్ 2021 యొక్క 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పృథ్వీ షా 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు. ఇప్పుడు పృథ్వీ షా శ్రీలంకతో సిరీస్ కోసం బిజీగా ఉన్నాడు. అయితే, ఈ ఇద్దరూ శ్రీలంక టూర్‌లో మంచి ప్రదర్శన కనబరిస్తే.. టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also read:

Error 503: ఓ గంటపాటు ఇంటర్‌నెట్ డౌన్.. అంతరాయంకు చింతిస్తూ వెబ్ పేజ్‌లో 503… ఎందుకో తెలుసా..

Tokyo Olympics: కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి …ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ

ICC Award: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నది వీరే.. మన హీరోలు ఎక్కడా..!