Du-Plessis: విరాట్, పాండ్యాకు పోటీగా విదేశీ క్రికెటర్.. ఉర్దూలో పచ్చబొట్టు.. సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్..
Du-Plessis: ఆటగాళ్ళకు పచ్చబొట్లుపై వ్యామోహం కొత్తదేం కాదు. క్రికెట్, ఫుట్‌బాల్ మరే ఇతర క్రీడలకు సంబంధించిన ప్లేయర్లు అయినా టాటూలను..
Du-Plessis: ఆటగాళ్ళకు పచ్చబొట్లుపై వ్యామోహం కొత్తదేం కాదు. క్రికెట్, ఫుట్‌బాల్ మరే ఇతర క్రీడలకు సంబంధించిన ప్లేయర్లు అయినా టాటూలను ఆకర్షణీయంగావేయించుకుంటారు. ప్రతి జట్టులో ఒకరు లేదా ఇద్దరు ప్లేయర్లు కచ్చితంగా టాటూ వేయించుకునే ఉంటారు. తాజాగా ధోనీ భాగస్వామ్య క్రికెటర్ కూడా టాటూల బాటపట్టాడు. అతనెవరో కాదు.. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న డూప్లెసిస్. తాజాగా డూప్లెసిస్ కూడా టాటూ వేయించుకున్నాడు. తన శరీరంపై పక్కటెముకల వద్ద ఉర్దూ భాషలో టాటూ వేయించుకున్నాడు. అయితే, ఈ టాటూకు ఓ అర్థం ఉందంటున్నాడు డూప్లెసిస్. ఇది, తన భావాలను వ్యక్తపరుస్తుందంటున్నాడు.
ఇంతకీ ఆ పచ్చబొట్టులో ఏముందంటే.. డూప్లెసిస్ తన పక్కటెముకలపై ఉర్దూలో ‘ఫజల్’ అని టాటూ వేయించుకున్నాడు. ఫజల్ అంటే అందమైన, మంచి, దేవుడిపై విశ్వాసం కలిగి ఉన్నవారు అని అర్థం. డూప్లెసిస్ తన జీవితంలో వచ్చిన మార్పులకు గుర్తుగా ఈ పచ్చబొట్టు వేయించుకున్నట్లు చెబుతున్నాడు.
Also read:
Black Fungus: భయంతో చెట్లన్నీ నరికేస్తున్న ప్రజలు.. వారు చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..