AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virender Sehwag: సెహ్వాగా.. మజాకా..! 2 బంతుల్లో 21 పరుగులు.. క్రికెట్ చరిత్రలో అదే అత్యంత చెత్త ఓవర్..

క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎవరంటే.. ఠక్కున అందరూ చెప్పే మొదటి పేరు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్ధి ఎవరైనా.. ఏ బంతి విసిరినా..

Virender Sehwag: సెహ్వాగా.. మజాకా..! 2 బంతుల్లో 21 పరుగులు.. క్రికెట్ చరిత్రలో అదే అత్యంత చెత్త ఓవర్..
Sehwag
Ravi Kiran
|

Updated on: Jun 09, 2021 | 9:05 AM

Share

క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎవరంటే.. ఠక్కున అందరూ చెప్పే మొదటి పేరు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్ధి ఎవరైనా.. ఏ బంతి విసిరినా.. సెహ్వాగ్ స్టైలే సెపరేట్.. మొదటి బంతికి బౌండరీ బాదాల్సిందే. ఇలా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించే సెహ్వాగ్.. అప్పట్లో పాకిస్తాన్ బౌలర్ రాణా నవీద్ ఉల్ హుస్సేన్‌కు చుక్కలు చూపించాడు.ఈ పాక్ బౌలర్ సెహ్వాగ్ దెబ్బకు.. కేవలం రెండు బంతుల్లోనే 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో అదే అత్యంత చెత్త ఓవర్ కావడం గమనార్హం.

సరిగ్గా 17 ఏళ్ల క్రితం. మార్చి 13, 2004న భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బౌలింగ్‌కు రాణా దిగాడు. అయితే అప్పటికే సెహ్వాగ్ మంచి ఊపు మీదున్నాడు. బౌలర్ ఎవరైనా కూడా వదలకుండా అందరినీ బెంబేలెత్తించాడు. దీనితో ఒత్తిడికి గురైన రాణా.. మొదటి బంతికే నో బాల్ వేశాడు.. సెహ్వాగ్ దాన్ని బౌండరీకి తరలించాడు. రెండో బంతి కూడా నో బాల్.. సెహ్వాగ్ ఆ బంతిని కూడా బౌండరీ కొట్టాడు. మూడో బంతి కూడా నో బాల్.. అయితే సెహ్వాగ్ ఈసారి దాన్ని మిస్ చేశాడు. ఇక నాలుగో బంతి లీగల్ డెలివరీ కాగా.. ఎలాంటి పరుగు రాలేదు. మళ్లీ ఐదో బంతిని రాణా నో బాల్ విసరగా.. సెహ్వాగ్ దాన్ని బౌండరీకి తరలించాడు. ఆరు బంతి కూడా నో బాల్ విసిరితే.. పరుగులేమి రాలేదు. చివరికి రెండో లీగల్ డెలివరీ వేయగా.. ఆ బంతిని కూడా సెహ్వాగ్ బౌండరీ కొట్టాడు.

దీనితో రెండు బంతులకే 21 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్ మొదటి రెండు బంతులు.. 4NB, 4NB, 0NB, 0, 4NB, 0NB, 4 రూపంలో సెహ్వాగ్ 21 పరుగులు రాబట్టుకున్నాడు. కాగా, క్రికెట్ ప్రపంచం ఇప్పటికీ అదే అత్యంత చెత్త ఓవర్ అని విశ్లేషకులు చెబుతారు. ఇదిలా ఉంటే రాణా ఆ ఓవర్‌లో మిగిలిన బంతులకు మూడు పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం.

ఇవి చదవండి:

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో

ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..

వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..