Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోవడంతో అందరూ క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏదొకటి ట్రై చేస్తున్నారు....

Viral News: ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..
Bride
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2021 | 1:06 PM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోవడంతో అందరూ క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏదొకటి ట్రై చేస్తున్నారు. వాటిల్లో కొన్ని ఫెయిల్ అయినా.. మరికొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వధువు.. తనకు కాబోయే వరుడు కోసం చేసిన పెళ్లి ప్రకటన ఇప్పుడు నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.

సహజంగా పెళ్లి ప్రకటనకు ఎవరైనా కూడా వధువు లేదా వరుడు డీటైయిల్స్‌ ఇస్తారు. అయితే ఇక్కడ ఈ వధువు కొంచెం వినూత్నంగా ఆలోచించింది. అసలే కరోనాకాలం కావడంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తనకు.. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావాలంటూ పెళ్లి ప్రకటన ఇచ్చింది.

అంతేకాకుండా తన ఇష్టాల గురించి వివరిస్తూ.. వరుడులో ఏయే క్వాలిటీస్ ఉండాలో స్పష్టంగా చెప్పింది. పైన పేర్కొన్న క్వాలిటీస్‌ ఉన్నవారు తనను సంప్రదించవచ్చునని పేర్కొంటూ.. ఆ వధువు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇక ఈ ప్రకటన చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ అమ్మాయి ఎవరో గానీ భలేగా పెళ్లి ప్రకటన ఇచ్చిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఆ ప్రకటనపై ఓ లుక్కేయండి.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

6ab78048 2407 4fb1 83cf A83a170b01f9