ఈ పథకం మధ్యలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, కుటుంబం ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, పాలసీ మిగిలిన సంవత్సరాల్లో అతడి కుమార్తెకు ప్రతి సంవత్సరం రూ .1 లక్ష లభిస్తుంది. ఈ పాలసీని తీసుకోవటానికి, కనీస వయస్సు 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు ఒక సంవత్సరం ఉండాలి. కుమార్తె వయస్సు ప్రకారం, ఈ పాలసీ కాలపరిమితి తగ్గించబడుతుంది. ఈ పాలసీని ఎక్కువ లేదా తక్కువ ప్రీమియం కోసం కూడా తీసుకోవచ్చు.