అయితే బజాజ్ సీటీ 100 ధర రూ.55 వేలు వరకు ఉంది. మీరు రూ.6 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. ఇంకా రూ.49,214 కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని చెల్లించవచ్చు. ఉదాహరణకు.. 9.7 శాతం వరకు వడ్డీ రేటుతో మీరు లోన్ తీసుకున్నారని అనుకుంటే.. ఇప్పుడు మీకు నెలకు రూ.1765 చెల్లించాలి. మీరు ఇలా 36 నెలలు కట్టాల్సి ఉటుంది. అదే మీరు ఇంకా ఈఎంఐ భారం తగ్గించుకోవాలని భావిస్తే.. అప్పుడు ఐదేళ్ల టెన్యూర్ పెట్టుకోవాలి. అప్పుడు ఈఎంఐ రూ.1218 అవుతుంది.