Ind Vs Eng: టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

టీమ్ ఇండియా పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా, మొదటి మ్యాచ్‌లో 0 పరుగులకు నాలుగు వికెట్లు...

Ind Vs Eng: టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 07, 2021 | 8:24 AM

సరిగ్గా 69 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత క్రికెట్ జట్టు ఎన్నో అంచనాలతో ఇంగ్లాండ్ పర్యటనకు చేరుకుంది. టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య జట్టుకు గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. టీమ్ ఇండియా పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా, మొదటి మ్యాచ్‌లో 0 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్‌ను ఎదుర్కోవడంలో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

ఇంగ్లాండ్, టీమిండియా మధ్య ఈ మ్యాచ్ ఈ రోజున జరిగింది, అంటే 7 జూన్ 1952 న. వేదిక హెడింగ్లీ. కెప్టెన్ విజయ్ హజారే నేతృత్వంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ అయింది. విజయ్ మంజ్రేకర్ 133 పరుగులు చేయగా, కెప్టెన్ హజారే 89 పరుగులతో రాణించాడు. జట్టులో వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా 20 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెడ్ ట్రూమాన్ మూడు వికెట్లు తీయగా, జిమ్ లేకర్ నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. అయితే టీమిండియా బౌలర్లు ధీటుగా సమాధానం ఇవ్వడంతో ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ గులాం అహ్మద్ ఐదు వికెట్లు పడగొట్టాడు. దీనితో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు వెనకంజలో ఉంది.

వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయారు.. స్కోర్ బోర్డు 0/4..

మొదటి ఇన్నింగ్స్ ప్రదర్శన తర్వాత భారత్ జట్టు గట్టిగా సమాధానం చెబుతుందని అందరూ ఊహించారు. కానీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే టీమ్ ఇండియా లైనప్ కుదేలయ్యయింది. పంకజ్ రాయ్, దత్తా గైక్వాడ్, ఎంకే మినిస్టర్, విజయ్ మంజ్రేకర్ ఇలా వరుసగా నలుగురు బ్యాట్స్‌మెన్ తమ ఖాతాను తెరవకుండా పెవిలియన్ చేరారు. తన మొదటి మ్యాచ్ ఆడుతున్న ట్రూమాన్ టీమిండియాకు సెకండ్ ఇన్నింగ్స్‌లో గట్టి షాక్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ హజారే అర్ధ సెంచరీ చేయడంతో భారత్ 165 చేయగా.. ఇంగ్లాండ్ ముందుకు 125 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించబడింది. ఇక ఆ టార్గెట్‌ను ఇంగ్లాండ్ అలవోకగా చేధించి విజయం సాధించింది.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?