Rahane Birthday: ఇవాళ రెహానే బర్త్‌డే.. అద్భుతమైన ఫోటోను షేర్ చేసిన వీరేంద్ర సేహ్వాగ్..
Rahane Birthday: టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సేహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తారో అందరికీ...
Rahane Birthday: టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సేహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తారో అందరికీ తెలిసిందే. ఛాన్స్ దొరికితే చాలు ఏ అంశంపై అయినా చెడుగుడు ఆడేస్తారు. సహ క్రికెటర్లపై స్పాంటేనియస్‌గా పంచ్‌లు విసురుతారు. విరూ బాబా అవతారం ఎత్తిన సేహ్వాగ్.. సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్‌లో పంచులు విసురుతూ అభిమానుల్లో నవ్వులు పూయిస్తారు. అదే సమయంలో ప్రస్తుత క్రికెట్ ప్లేయర్లను మోటివేట్ చేస్తారు. వారిలో అద్భుత ప్రేరణను నింపుతారు.
ఇదిలా ఉంటే ఆదివారం నాడు అజింక్య రహానే 33వ పుట్టిన రోజు సందర్భంగా వీరేంద్ర సేహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విశెష్ చెప్పిన వీరూ బాబా.. రహానే చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇంతకు ముందెన్నడూ అభిమానులు చూడని ఫోటో అది. చిన్నతనంలో కరాటే ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఉన్న రహానే ఫోటోనే ట్విట్ చేసిన వీరేంద్ర సేహ్వాగ్.. ‘‘మీలోని కరాటే కిడ్‌ను ఆస్ట్రేలియా టూర్‌లో చూశాం. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 36 పరుగులకే ఆల్ అవుట్ అవడం, ఆ తరువాత.. మీ సారథ్యంలో మిగతా మ్యాచ్‌లు గెలిచి చారిత్రాత్మక సిరీస్‌ను కైవసం చేసుకోవడం ప్రతీ క్రికెట్ లవర్ చిరకాలం గుర్తుంచుకుంటారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు రహానే’’ అని ప్రశంసలు కురిపిస్తూ క్యాప్షన్ పెట్టారు.
Veerendra Sehwag Tweet:
The Karate Kid in you was seen in Australia. After the 36 all out in Adelaide , the way you led from the front in a historic test series victory will always be etched in every Cricket lover’s memory. Happy Birthday @ajinkyarahane88 Kee May pic.twitter.com/ZCIEPA2hJC
— Virender Sehwag (@virendersehwag) June 6, 2021
Also read:
“Don’t Know If I’ll Play”: ఎన్ని రోజులు ఆడతానో తెలియదు.. కీలక ప్రకటన చేసిన రోజర్ ఫెడరర్..