Viral Pics: దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?

ఈ ఆధునిక యుగంలో ఆత్మల కాన్సెప్ట్‌ను పెద్దగా ఎవరూ నమ్మరు. అయితే ఎవరైనా చనిపోతే.. వారు ఆత్మగా మారి ఏదొక మార్గం ద్వారా మనల్ని...

Viral Pics: దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 04, 2021 | 3:32 PM

ఈ ఆధునిక యుగంలో ఆత్మల కాన్సెప్ట్‌ను పెద్దగా ఎవరూ నమ్మరు. అయితే ఎవరైనా చనిపోతే.. వారు ఆత్మగా మారి ఏదొక మార్గం ద్వారా మనల్ని సంభాషిస్తారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఆత్మకు శరీరం ఉండదు కాబట్టి.. వ్యక్తినైనా, వస్తువునైనా మీడియంగా తీసుకుని అవి మనుషులతో సంభాషిస్తాయని పరిశోధకులు అంటుంటారు. ఈ థీమ్‌తోనే ఎన్నో హారర్ సినిమాలు కూడా వచ్చాయి. అందులో ఒకటి అన్నాబెల్. సరిగ్గా ఆ అన్నాబెల్ స్టోరీలా రియల్‌ లైఫ్‌లో ఓ గగుర్పొడిచే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

01

ఓ చిన్న టౌన్‌కు దగ్గరలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఒక మర్మమైన బొమ్మ గ్రామస్తులకు ఉయ్యాలపై ఊగుతూ కనిపించిందట. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌ల్యాండ్‌లో లుసిండా అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో కేవలం 406 మంది మాత్రమే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ఆ బొమ్మ అక్కడకి ఎలా వచ్చిందో.? ఎవరైనా తీసుకొచ్చారా.? లేక ఇంకేదైనా రహస్యం ఉందా.? అనే విషయాలు ఏవి తెలియలేదు. అక్కడ ఉన్న స్థానికులు మాత్రం దాని గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఇక ఆ మర్మమైన బొమ్మ ఎప్పుడూ సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తిందని స్థానిక రాజకీయ నాయకుడు నిక్ డామెట్టో అన్నారు.

02

ఇదిలా ఉంటే ఎవరూ ఊహించని విధంగా అక్కడే నివసిస్తున్న ఓ వ్యాపారి మాత్రం ఒక జంట ఆ బొమ్మను అక్కడ పెట్టారని.. అదంతా స్పూఫ్ మాత్రమేనని చెప్పాడు. కట్టుకధలన్నింటిని కొట్టిపారేశాడు. మరోవైపు గతేడాది ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ కొత్త ఇంటికి షిఫ్ట్ కాగా.. అందులో ఒక రహస్య గది నిండా అన్నాబెల్ బొమ్మలను చూసి గగుర్పాటుకు గురైన సంగతి తెలిసిందే.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే