Viral Video: రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో

యాక్సిడెంట్లు..ఎప్పుడు, ఎక్కడ, ఎట్నుంచి జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు..మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ..అవతలి వారు చేసే..

Viral Video: రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో
Dog
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2021 | 2:09 PM

యాక్సిడెంట్లు..ఎప్పుడు, ఎక్కడ, ఎట్నుంచి జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు..మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ..అవతలి వారు చేసే తప్పులతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ఒక్కదెబ్బకు నేలకూలి..నడుం విరిగినంత పనైంది.

వీడియోలో ఓ వ్యక్తి కార్‌ పార్క్‌ చేసి…పార్కింగ్ ప్లేస్‌ నుండి బయటకు వచ్చాడు..అటు ఇటూ చూసుకుంటూ..జాగ్రత్తగా రోడ్డు దాటడానికి ముందుకు వెళ్తున్నాడు..వేగంగా వస్తున్న కార్లను దాటుకుని బయటపడ్డాడు..హమ్మాయ్య…రోడ్డు దాటేశాను అనుకునేలోపుగానే…అతడు ప్రమాదానికి గురయ్యాడు..వేగంగా పరిగెత్తుకొచ్చిన ఓ కుక్క అతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు ఒక్కసారిగా కిందపడిపోయాడు..పాపం దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది..కిందపడిన చోటు నుంచి లేవలేకపోయాడు. కానీ, అతన్ని ఎవరు ఢీకొట్టారు అన్నది మాత్రం అతడు గమనించలేదు..ఎందుకంటే..ఆ కుక్క అంత స్పీడ్‌గా వచ్చి అతన్ని ఢీకొట్టింది.

రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ప్రమాదాలు ఇలా కూడా వస్తాయా అనుకుంటూ అవాక్కైపోతున్నారు. చూసేందుకు కాస్త షాకింగ్‌గానే ఉన్నప్పటికీ వీడియో చూసిన తర్వాత నవ్వు తెప్పిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?