Tokyo Olympics: కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి …ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు లేఖ
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు లేఖ రాసినట్లుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపంది. పుల్లెంల గోపిచంద్‌తో సహా నలుగురు కోచ్‌లను షట్లర్లతో పాటు పంపాలని...
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షట్లర్లతో పాటు టోక్యో వెళ్లడానికి నలుగురు కోచ్‌లను అనుమతించాలని అభ్యర్థించింది. ఇద్దరు ఫిజియోలను వారితో పాటు ప్రయాణించడానికి అంగీకరించాలని పేర్కొంది.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు లేఖ రాసినట్లుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపంది. పుల్లెంల గోపిచంద్‌తో సహా నలుగురు కోచ్‌లను షట్లర్లతో పాటు పంపాలని కోరారినట్లుగా వెల్లడించింది. అలాగే ఇద్దరు ఫిజియోలను వారితో పాటు వెళ్లడానికి అంగీకరించాల్సిందిగా కోరింది. ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మన దేశానికి సానుకూల విజయాలు వస్తాయని అభిప్రాయపడ్డింది.
టోక్యో ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం మొత్తం అథ్లెట్ల సంఖ్యలో మూడో వంతు మాత్రమే సహాయక సిబ్బంది ఉండాలి. కాగా, బ్యాడ్మింటన్ నుంచి పీవీ సింధుతో పాటు సాయి ప్రణీత్, డబుల్స్ జోడీ చిరగా శెట్టీ, సాత్విక్ రాజ్ రాంకీ రెడ్డి అర్హత సాధించారు. అయితే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన అభ్యర్థనను ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇలాంటి సలహాలు, సూచనలు, అభ్యర్థనలు కాస్తా ముందుగా చెప్పి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.