Wrestler Sushil Kumar: ప్రోటీన్ షేక్, వ్యాయామ పరికరాలిప్పించండి.. ఢిల్లీ హైకోర్టుకు సుశీల్ కుమార్ అభ్యర్థన..
Wrestler Sushil Kumar: తోటి రెజ్లర్‌ను హత్య చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన రెజ్లర్ సుశీల్ కుమార్.. తనకు ప్రోటీన్ షేక్,..
Wrestler Sushil Kumar: తోటి రెజ్లర్‌ను హత్య చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన రెజ్లర్ సుశీల్ కుమార్.. తనకు ప్రోటీన్ షేక్, వ్యాయామ పరికరాలను ఇవ్వాలని కోరాడు. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నందున ప్రోటీన్ సప్లిమెంట్స్, వ్యాయామ బృందాలు, ప్రత్యేక ఆహారం అవసరం అని, ఆ మేరకు వీటిని తనకు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో సుశీల్ కుమార్ పిటిషన్ దాఖలు చేశాడు.
జాతీయ రాజధాని ఛత్రసల్ స్టేడియంలో తన జూనియర్ సాగర్ ధంకర్ హత్యకు సంబంధించి ఛాంపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు మే 23 న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుశీల్ కుమార్, అతని సహచరులు కొట్టడంతో ధంకర్ మే మొదటి వారంలో ఢిల్లీ ఆసుపత్రిలో చేరాడు. ఆ క్రమంలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు ఆరోపించారు. అంతేకాదు.. బాధితుడిని సుశీల్ కుమార్, అతని సహచరులు కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడియో క్లిప్‌ను పోలీసులు సంపాదించారు. కాగా, అరెస్ట్‌కు ముందు సుశీల్ కుమార్ దాదాపు మూడు వారాల పాటు పరారీలో ఉన్నాడు.
ఇదిలాఉంటే.. హత్య కేసులో అరెస్ట్ అయిన సుశీల్ కుమార్‌కు సాధారణ ఖైదీకి వడ్డిస్తున్న ఆహారాన్నే జైలు అధికారులు వడ్డిస్తున్నాు. జైలు ఆహారంలో ఐదు రోటీలు, రెండు కూరగాయలు, పప్పు, రైస్ ఉన్నాయి. ఖైదీలకు రోజుకు రెండుసార్లు వీటిని పెడతారు. ఇక ఖైదీలు జైలు క్యాంటీన్ నుండి నెలకు రూ. 6,000 విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఆహారం తనకు సరికాదని, త్వరలో ఒలంపిక్ గేమ్స్ ఉన్నందున.. ప్రత్యేక ఆహారం కింద ఒమేగా 3 క్యాప్సూల్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ మాత్రలను, ఇతరాలను కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సుశీల్ కుమార్. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారించనుంది.
కాగా, రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయుడిగా గుర్తింపు పొందిన రెజ్లర్ సుశీల్ కుమార్.. హత్య కేసులో అరెస్టై ఢిల్లీలోని మాండోలి జైలులో శిక్షణ అనుభవిస్తున్నాడు.
Also read:
Black Fungus: భయంతో చెట్లన్నీ నరికేస్తున్న ప్రజలు.. వారు చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..
UPI Money Transfer: పొరపాటున మీ డబ్బును ఇతరుల అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారా?.. ఇలా తిరిగి పొందండి..!