AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Four Ingredients : ఊపిరితిత్తుల చక్కటి పనితీరు కోసం ఈ నాలుగు దినుసులు తప్పనిసరి..! అవి ఏంటంటే..?

Four Ingredients : శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి మీ ఊపిరితిత్తులు బాగా పనిచేయడం అవసరం. ఊపిరితిత్తుల

Four Ingredients : ఊపిరితిత్తుల చక్కటి పనితీరు కోసం ఈ నాలుగు దినుసులు తప్పనిసరి..! అవి ఏంటంటే..?
Lungs To Function
uppula Raju
|

Updated on: Jun 08, 2021 | 10:59 PM

Share

Four Ingredients : శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి మీ ఊపిరితిత్తులు బాగా పనిచేయడం అవసరం. ఊపిరితిత్తుల నుంచి ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే ఆక్సిజన్ మీ శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోతే మీరు ఉబ్బసం, బ్రాంకైటీస్, న్యుమోనియా, క్షయ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. మరోవైపు కోవిడ్ 19 వంటి అంటువ్యాధిని నివారించడానికి మీ ఊపిరితిత్తులను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. మరోవైపు కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమయంలో మీరు వాటిపై శ్రద్ధ చూపడం అవసరం. ప్రతిరోజు డైట్‌లో ఈ నాలుగు దినుసులు చేర్చితే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

1. ఓరెగానో: ఒరెగానోలో బయోయాక్టివ్ కాంపౌండ్ పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి. ఈ మందు ఇటలీలో చాలా ప్రసిద్ధి చెందినది. ఇది రోస్మరినిక్ ఆమ్లంలో ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే హిస్టామిన్ ను తగ్గిస్తుంది. దీనిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది అంటువ్యాధులు రోగకారక క్రిములను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. 2. గిలోయ్: కరోనా సంక్షోభంలో గిలోయ్ బాగా పాపులర్ అయింది. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఊపిరితిత్తులను సంరక్షిస్తుంది. జిలాయ్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. 3. సెలరీ పువ్వులు: సెలరీని ఆయుర్వేదంలో ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిని సుగంధ ద్రవ్యంగా రుచులలో ఉపయోగిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ మందు శ్వాసనాళాన్ని సడలించి ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. 4. పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి, గాలిని శుభ్రం చేస్తుంది. పసుపు అనేది యాంటీ వైరల్ ఔషధం. ఇది ఊపిరితిత్తులను ఎల్లప్పుడు కాపాడుతుంది.

Drumstick Benfits : శాకాహారుల మాంసాహారి మునక్కాయ..! గర్భిణీలకు ఒక వరంలాంటిది.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ కేబినెట్ భారీ నిర్ణయాలు.. జిల్లా కేంద్రాల్లో వైద్య సేవలను పెంచుతూ కీలక ప్రకటన

Viral Video : చెరువులో నీళ్లు తాగుతున్న సింహం..! దాని ముక్కులోకి వెళ్లడానికి ప్రయత్నించిన తాబేలు.. వైరల్ వీడియో..