These Foods : పరగడుపున ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి..?

These Foods : కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలవర్ధకమైన ఆహారాన్ని

These Foods : పరగడుపున ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి..?
These Foods
Follow us
uppula Raju

|

Updated on: Jun 08, 2021 | 11:03 PM

These Foods : కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే కొన్ని పదార్థాలు పరగడుపున తింటే చాలా మంచిదంటారు పెద్దలు. ఎందుకంటే వాటి ప్రభావం అప్పుడే ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని మాత్రం పరగడుపున అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటివల్ల చాలా ప్రమాదం. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

1. అరటి: ఖాళీ కడుపుతో అరటిపండును ఎప్పుడూ తినరాదు. ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచి, కాల్షియం, మెగ్నీషియంల స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది. దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి. 2. సోడా: ఖాళీ కడుపుతో సోడాను తీసుకోకూడదు. దీనిలో అధిక మొత్తంలో కార్బోనేట్ ఆమ్లం ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల వికారం, పొట్ట సమస్యలు వస్తాయి. 3. టొమాటాలు: టొమాటాలు తినడం చాలా ఆరోగ్యకరం. కానీ ఖాళీ కడుపుతో వీటిని తినరాదు. ఇవి ఆమ్ల స్వభావం వల్ల పొట్టను దెబ్బతీస్తాయి. 4. సిట్రస్ పండ్లు: పండ్లు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ ద్రాక్ష, నిమ్మ, నారింజ, జామ వంటి పుల్లటి పండ్లను పరగడుపున తినకూడదు. సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఫ్రక్టోజ్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల కడుపులోఅసౌకర్యం కలిగిస్తుంది. 4. టీ-కాఫీ: చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ద్వారా మొదలు పెడితే అది తమ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఈ రెండింటిని సేవించడం వల్ల తీవ్రమైన ఎసిడిటీ కలుగుతుంది. 5. చిలగడ దుంప: చిలగడదుంపను ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినరాదు. ఇందులో టానిన్, పెక్టిన్ ఉంటాయి. ఇది ఖాళీ కడుపున గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్యలను కలిగిస్తుంది దీని వల్ల కడుపు నొప్పి, ఛాతీ చిరాకు కలుగుతుంది. 6. స్పైసీ ఫుడ్: స్పైసీ ఫుడ్‌ను ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. సుగంధ ద్రవ్యాలలో సహజ ఆమ్లం ఉంటుంది. ఇది పొట్టను కలవరానికి లోను చేస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, మంట, తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు.

Four Ingredients : ఊపిరితిత్తుల చక్కటి పనితీరు కోసం ఈ నాలుగు దినుసులు తప్పనిసరి..! అవి ఏంటంటే..?

Drumstick Benfits : శాకాహారుల మాంసాహారి మునక్కాయ..! గర్భిణీలకు ఒక వరంలాంటిది.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ కేబినెట్ భారీ నిర్ణయాలు.. జిల్లా కేంద్రాల్లో వైద్య సేవలను పెంచుతూ కీలక ప్రకటన