Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.. అనుకోని ప్రయాణాలు

Horoscope Today: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మందే ఉంటారు..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.. అనుకోని ప్రయాణాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 13, 2021 | 7:03 AM

Horoscope Today: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మందే ఉంటారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 13న) ఆదివారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశివారు ఈ రోజు విలువైన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, ఉద్యోగ సంబంధించిన విషయాలలో ఆలోచనలు పెరుగుతాయి. అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.

వృషభరాశి

ఈ రాశివారు కుటుంబ పరమైన వివిధ రకాల పనులలో పాల్గొంటారు. ఖర్చులను నియంత్రణ చేసుకోవడం మంచిది. ఈ రాశివారు అష్టలక్ష్మి పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

మిథున రాశి

ఈ రాశివారు ఈ రోజు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయాలలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మ వారి నామస్మరణ మేలు చేస్తుంటుంది.

కర్కాటక రాశి

భాగస్వామి అనుబంధం, వ్యాపారాల విషయాలలో ఈ రాశివారు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మవారి దర్శనం ఎంతో మేలు చేస్తుంటుంది.

సింహరాశి

అనారోగ్య భవనాలు ఏర్పడకుండా ఈ రాశివారు విశ్రాంతి తీసుకోవడం ఎంతో మంచిది. ఖర్చులు పెరుగుతాయి. శివ పంచాక్షరి జపం ఎంతో మేలు చేస్తుంటుంది.

కన్యరాశి

ఆరోగ్య విషయాలలో ఈ రాశివారు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

తులారాశి

ఈ రాశివారు ఆహారం విషయంలో సమయ పాలన పాటించడం మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేస్తుంటారు. ఆంజనేయస్వామిని పూజించడం ఎంతో మేలు చేస్తుంటుంది.

వృశ్చిక రాశి

రచన రంగంలో పలు శుభాలు కలుగుతాయి. కష్టతర కార్యక్రమాలను అధిగమిస్తుంటారు. శ్రీరామ నామ స్మరణ చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.

ధనుస్సు రాశి

ఈ రాశివారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అనుకూలమైన భవనాలు ఏర్పడుతుంటాయి. గణపతి నామస్మరణ ఎంతో మేలు చేస్తుంటుంది.

మకర రాశి

కష్టతరమైన పనులు చేపడతారు. దీంతో కొంత ఒత్తిడికి గురవుతారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలలో కాస్త జాగ్రత్తలు వహించడం మంచిది. సుదర్శనస్వామి నామస్మరణం మేలు చేస్తుంటుంది.

కుంభరాశి

ఈ రాశివారు పలు విషయాలలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తుంటారు. శివాలయంలో పూజలు చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.

మీనరాశి

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పేదవారికి ధనం, అన్నదానం చేయడం మంచిది. విశేషంగా గణపతి నామస్మరణం మేలు చేస్తుంటుంది.